తగ్గిన బంగారం ధర
గత ఐదు ట్రేడింగ్ల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధర అంతర్జాతీయ పరిణామాలతో సోమవారం తగ్గింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300 తగ్గి రూ.31వేల కంటే తక్కువకు దిగజారింది . అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాను
గత ఐదు ట్రేడింగ్ల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధర అంతర్జాతీయ పరిణామాలతో సోమవారం తగ్గింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300 తగ్గి రూ.31వేల కంటే తక్కువకు దిగజారింది . అమెరికా అధ్యక్ష ఎన్నికలు సానుకూలంగా ఉంటాయన్న సంకేతాలు బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాకుండా డాలర్ మరింత బలపడనుందన్న అంశం కూడా బంగారం తగ్గుదలకు కారణమైంది. దేశ రాజధానిలో 10గ్రాముల పసిడి రూ.30,700గా పలుకుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందించాయి.

మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.450 తగ్గి రూ.43,600 పలికింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు



Click it and Unblock the Notifications