రిలయన్స్‌పై కేంద్రం కొరడా
ఓఎన్‌జీసీ గ్యాస్ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఆర్‌ఐఎల్ సహా భాగస్వామ్య సంస్థలైన బిపి, నికో రిసోర్సెస్ మొత్తం 155 కోట్ల డాలర్ల (సమారు 11,000 కోట్ల
ఓఎన్‌జీసీ గ్యాస్ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఆర్‌ఐఎల్ సహా భాగస్వామ్య సంస్థలైన బిపి, నికో రిసోర్సెస్ మొత్తం 155 కోట్ల డాలర్ల (సమారు 11,000 కోట్ల రూపాయలు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ ప్రభుత్వం డిమాండ్ నోటీసులు పంపించింది. కేజీ బేసిన్‌లో ప్రభుత్వ రంగ సంస్థ ఔన్‌జిసికి చెందిన క్షేత్రాలు, రిలయన్స్‌కు చెందిన సహజవాయువు క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నా యి. ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి సహజవాయువు పొరుగునే ఉన్న ఆర్‌ఐఎల్ క్షేత్రాల్లోకి తరలిపోయినట్టుగా వెల్లడైంది. ఈ సహజవాయు నిల్వలను వెలికితీసి భారీ ఎత్తున లబ్ది పొందినట్లు ఆర్‌ఐఎల్ దాని భాగస్వా మ్య పక్షాలపై ఆరోపణలు వెల్తువెత్తిన విషయం తెలిసిందే.

2016 మార్చితో ముగిసిన ఏడు సంవత్సరాల కాలంలో ఓఎన్‌జీసీ క్షేత్రాల్లోంచి తరలివచ్చిన 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల సహజవాయువును విక్రయించి 147 కోట్ల డాలర్లను రిలయన్స్ ఆర్జించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. మూడు భాగస్వామ్య సంస్థలు ఈ మొత్తా న్ని తిరిగి చెల్లించాలంటూ కేంద్ర పెట్రోలియం శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ 147 కోట్ల డాలర్ల నుంచి గ్యాస్ ఉత్పత్తిపై చెల్లించిన 7.171 కోట్ల డాలర్ల రాయల్టీని మినహాయించుకునే అవకాశం ఆర్‌ఐఎల్ దాని భాగస్వామ్య పక్షాలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. మిగిలిన మొత్తానికి లిబర్ ప్లస్ రెండు శాతం రేటుతో లెక్కిస్తే వచ్చే 14.98 కోట్ల డాలర్ల వడ్డీని కలిపి మొత్తం 155 కోట్ల డాలర్లను సర్కారు ఖజానాకు జమచేయాలని ఆర్‌ఐఎల్, బిపి, నికోను నోటీసుల్లో ప్రభుత్వం ఆదేశించింది.
రిలయన్స్ ఇప్పటివరకు తీసుకున్న పెట్రోలియం వనరుల మొత్తానికి లెక్క కట్టామని, దానంతటిని త్వరలోనే సంస్థ చెల్లించాల్సి ఉంటుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications