నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
అమెరికా ఎన్నికల భయాలు భారత స్టాక్ మార్కెట్లను వెంటాడుతూనే ఉన్నాయి. స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టాల బాటలోనే నడిచాయి.శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 156.13 పాయింట్లు కోల్పోయి 27,274
అమెరికా ఎన్నికల భయాలు భారత స్టాక్ మార్కెట్లను వెంటాడుతూనే ఉన్నాయి. స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టాల బాటలోనే నడిచాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 156.13 పాయింట్లు కోల్పోయి 27,274.15 వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్లు నష్టపోయి 8,433.75 ముగిశాయి.

లాభపడిన వాటిలో ఐటీసీ, విప్రో, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఉండగా, నష్టపోయిన వాటిలో సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, హీరో, భారతీ ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా షేర్లు ముందు ఉన్నాయి.
ఐటీసీ 4% లాభపడగా, ప్రభుత్వ రంగ షేర్లు దారుణంగా 3 నుంచి 4% నష్టపోయాయి. తీవ్రంగా నష్టపోయిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్‌బ్యాంకు ఉన్నాయి. రూపాయి డాలరుతో 66.70 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications