ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా ?
ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరతాయని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-అర్బన్
ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరతాయని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-అర్బన్) పథకం కింద ఇళ్లు పొందాలనుకునే ప్రజలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు. గురువారం నుంచే ఈ సేవ అందుబాటులోకి రానుందని, ఒక్కో దరఖాస్తుకు రూ.25 చెల్లించి అర్హత కలిగిన పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు గృహాల కోసం విజ్ఞప్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఇది కూడా చదవండి ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో ప్రయోజనాలు

బుధవారం వెంకయ్యనాయుడు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో గృహనిర్మాణ శాఖ, కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎ్‌ససీ) ఈ-గవర్నెన్స సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలో 2లక్షలకుపైగా కామన్ సర్వీసెస్ సెంటర్లు ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 60వేల కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర పథకం ద్వారా ఇళ్లు పొందాలనుకునే అర్హత కలిగిన ప్రజలు ఆధార్‌కార్డుతో తమ సమీప కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఎంవోయూ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా పథకం ద్వారా భారతదేశం రూపు మారిపోతోందన్నారు. ఆనలైనలో దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలైనందున పీఎంఏవై పరిధి, లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వటం ఇబ్బందులతో కూడుకున్నందున.. కొత్తగా ప్రారంభించిన ఈ సేవ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. 2005-14 మధ్య దేశంలో 13.70 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయగా.. గత ఏడాదిలోనే తమ ప్రభుత్వం 11లక్షల గృహాలను మంజూరు చేసిందన్నారు. మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో సీఎస్‌సీ కేంద్రాలు ముందువరుసలో ఉంటాయని, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నాయని అభినందించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం, ఈ పథకం గురించిన మరిన్నివివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications