దేశంలో 2015లో కోటీశ్వ‌రులు 48వేలే: ఐటీశాఖ‌

ఆదాయ‌పు ప‌న్ను శాఖ లెక్క‌ల ప్ర‌కారం దేశంలో కోటీశ్వ‌రుల సంఖ్య 48వేలుగా తేలింది. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. కోటి కంటే ఎక్కువ సంపాద‌న క‌లిగిన వారి సంఖ్య రూ. 48000 గా ఉన్న‌ట్లు తేలింది. అదే స

ఆదాయ‌పు ప‌న్ను శాఖ లెక్క‌ల ప్ర‌కారం దేశంలో కోటీశ్వ‌రుల సంఖ్య 48వేలుగా తేలింది. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. కోటి కంటే ఎక్కువ సంపాద‌న క‌లిగిన వారి సంఖ్య రూ. 48000 గా ఉన్న‌ట్లు తేలింది. అదే సంవ‌త్స‌రంలో రూ.కోటి కన్నా ఎక్కువ ఆర్జించే వారి సంఖ్య 10% పెర‌గ్గా, రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ. 1 కోటి లోపు సంపాద‌న ఉన్న వారి శాతం 22% ఎక్కువైంది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల ప్ర‌కారం ఐటీ శాఖ ప‌లు విశ్లేష‌ణ‌లు చేసిన సంద‌ర్భంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

3వేల మందికి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ

3వేల మందికి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ

రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్ల వ‌ర‌కూ సంపాద‌న క‌లిగిన వారి సంఖ్య 45,027గా ఉంది. రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ. కోటి మ‌ధ్య ఆదాయం గ‌ల‌వారు 98,815 మంది ఉన్న‌ట్లు తేలింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 3000గా ఉంది. దేశంలో ఏ ఏడాదిలోనైనా ఇంత పెరుగుద‌ల సంభ‌వించ‌డం ఇదే ప్ర‌థ‌మం. 2016లో సైతం కోటీశ్వ‌రుల సంఖ్య 15-20% పెర‌గ‌నున్న‌ట్లు అంచ‌నా వేశారు.

ఇద్ద‌రి వేత‌నం రూ. 200 కోట్లు

ఇద్ద‌రి వేత‌నం రూ. 200 కోట్లు

మొత్తం స‌మాచారం ప్ర‌కారం రూ. కోటి కంటే ఎక్కువ వేత‌నం క‌ల‌వారి సంఖ్య 24,942గా ఉండ‌గా; అదే రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ. 1 కోటి మ‌ధ్య జీతం తీసుకునే వారు 54,921 మంది ఉన్నారు. అందులో రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మ‌ధ్య 928 మంది, రూ. 10 నుంచి రూ. 25 కోట్ల మ‌ధ్య 232 మంది, రూ. 25 నుంచి రూ. 50 కోట్ల మ‌ధ్య 32 మంది వేత‌నంగా పొందుతున్నారు. 10 మంది వేత‌నం రూ. 50 నుంచి రూ. 100 కోట్ల మ‌ధ్య ఉంది. ఇద్ద‌రు రూ. 100 కోట్ల శాల‌రీని క‌లిగి ఉన్నారు.

సీఈవోల వేత‌నాలు

సీఈవోల వేత‌నాలు

ఎక్కువ మంది టాప్ సీఈవోలు ఒక ఉద్యోగం నుంచి మ‌రోదానికి మార‌డం, దేశంలో ఆర్థిక వృద్ది సంభ‌వించ‌డం వంటి కార‌ణాల రీత్యా ఉన్న‌త‌శ్రేణి ఉద్యోగుల జీతభ‌త్యాలు బాగా ఎక్కువ ఉన్న‌ట్లు నిపుణులు చెపుతున్నారు. వ‌చ్చే కొద్ది సంవ‌త్స‌రాల్లో టాప్ వేత‌నాలు అందుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంద‌ని బావిస్తున్నారు. దేశంలో అత్య‌ధిక వేత‌నం అందుకునే సీఈవోల్లో క‌లానిధి మార‌న్‌, న‌వీన్ జిందాల్, కే.ఎం.బిర్లా వంటి వారు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+