సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్పిజి) ధరలు స్వల్పంగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరను 2.05 రూపాయల చొప్పున మంగళవారం చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి.
సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్పిజి) ధరలు స్వల్పంగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరను 2.05 రూపాయల చొప్పున మంగళవారం చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. గడచిన ఐదు నెలల్లో ఈ పెంపు ఆరోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ ధర 430.64 రూపాయలకు చేరింది. ఇంతకుముందు ఇది 428.59 రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా పెరిగింది. కిలో లీటర్ ధర 3,434.25 రూపాయలు పెరిగి 50,260.63 రూపాయలకు చేరింది. అక్టోబర్ 1న కూడా 3.11 శాతం మేర ఎటిఎఫ్ ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. ప్రతి నెలా ఒకటో తేదీన సబ్సిడీ వంటగ్యాస్, ఎటిఎఫ్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తున్నాయి.

నాన్-సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్పిజి) ధరలు కూడా పెరిగాయి. 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను 38.50 రూపాయలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 529 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ప్రతి నెలా 15, 31 తేదీల్లో పెట్రోల్, డీజిల్, నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరిస్తున్నది తెలిసిందే. పెట్రోల్, డీజిల్ తరహాలోనే వంటగ్యాస్, కిరోసిన్ అమ్మకాలపైనా ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేయాలని నిర్ణయంచింది. ఈ క్రమంలోనే ఎల్పిజి, కిరోసిన్ ధరలను నెలనెలా స్వల్పంగా పెంచుతూ పోతోంది. ప్రతి నెలా సబ్సిడీ వంటగ్యాస్ ధరను 2 రూపాయల చొప్పున, లీటర్ కిరోసిన్ ధరను 25 పైసల చొప్పున పెంచుతోంది. మార్కెట్ ధరను చేరేదాకా ఇలా ధరలు పెరుగుతూనే ఉంటాయ. గతంలో డీజిల్ ధరను కూడా లీటర్కు 50 పైసల చొప్పున పెంచుతూ సబ్సిడీ నుంచి మినహాయంచినది తెలిసిందే. అంతకు ముందు పెట్రోల్ అమ్మకాలపైనా సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది.
More From GoodReturns

గ్యాస్ దొరకదనే భయం.. భారీగా పెరిగిన ఇండక్షన్ కుక్కర్ సేల్స్.. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల పరుగులు..

Gas cylinder price: వామ్మో.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? సామాన్యులపై ఎంత భారం?

LPG Shortage: దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత! మోడీ అత్యవసర మీటింగ్! ఏం జరగబోతోంది?

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications