న‌వంబ‌ర్ నెల‌కు ఉత్త‌మ ఎఫ్‌డీలు

. గ‌త నెల‌లో ఆర్‌బీఐ మ‌రోసారి రెపో రేట్ల‌ను త‌గ్గించగా కొన్ని బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌క్కువ చేశాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు సైతం త‌గ్గాయి. ఈ క్ర‌మంలో మేము మీ కోసం కొన్ని ఉత్త‌మ వ‌డ

బ్యాంకుల వడ్డీ రేట్లు ప్ర‌స్తుతం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వ‌డ్డీ రేట్లు ఎంత త‌క్కువ‌గా ఉన్నాయంటే కేవ‌లం ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కొంచెం అధిగ‌మించే విధంగా మాత్ర‌మే రాబ‌డులు వ‌స్తున్నాయి. పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల్లో సైతం వ‌డ్డీ రేట్లు త‌గ్గాయి. గ‌త నెల‌లో ఆర్‌బీఐ మ‌రోసారి రెపో రేట్ల‌ను త‌గ్గించగా కొన్ని బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌క్కువ చేశాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు సైతం త‌గ్గాయి. ఈ క్ర‌మంలో మేము మీ కోసం కొన్ని ఉత్త‌మ వ‌డ్డీ రేట్ల‌ను అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంపిక చేశాం. ఒక‌సారి వీటిపై ఓ లుక్కేయండి.

డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ప్ల‌స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌

డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ప్ల‌స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో టాప్‌5లో ఒక‌టిగా ఈ కంపెనీ ఉంది. దీవాన్ హౌసింగ్ పేరుతో ఈ సంస్థ ప్ర‌సిద్ది చెందింది. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రెండో త్రైమాసికంలో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాల‌ను ఆర్జించింది. గ‌తేడాదితో పోలిస్తే 29% వృద్దితో రూ. 233 కోట్ల లాభాల‌ను రాబ‌ట్టింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే మామూలుగా బ్యాంకు ఎఫ్‌డీల కంటే కంపెనీ ఎఫ్‌డీలు సుర‌క్షిత‌మైన‌వి కావు. అయితే డీహెచ్ఎప్ఎల్ ఎప్‌డీకి కేర్ ఏఏఏ(ట్రిపుల్ ఏ) రేటింగ్ ఇచ్చింది. కంపెనీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని సైతం నిర్వ‌హిస్తున్నందున ఈ కంపెనీ మంచి రాబ‌డుల‌నివ్వ‌గ‌ల‌ద‌ని చెప్ప‌వ‌చ్చు.

డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ప్ల‌స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌

డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్ర‌య్ ప్ల‌స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌

మీరు ఏడాది కాల‌ప‌రిమితి గ‌ల ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెడితే మీకు 8.25% వ‌ర‌కూ వ‌డ్డీ రావ‌చ్చు. బ్యాంకుల‌న్నీ దాదాపు మీకు 7.25% వడ్డీని ఇవ్వ‌జూపుతున్నాయి. రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.50 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. అదే 3 ఏళ్ల కాల‌ప‌రిమితి గ‌ల ఎఫ్‌డీపై 8.60% వడ్డీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 0.25% వ‌డ్డీ వ‌స్తుంది. మూడేళ్ల కాల‌ప‌రిమితి ఎఫ్‌డీల‌కు మంచి వ‌డ్డీ రేట్లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి వీలును బ‌ట్టి మూడేళ్ల కాలానికి డిపాజిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. మొత్తం ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లలో ఇది అత్య‌ధికం, ఉత్త‌మం.

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్న‌తి

శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్న‌తి

దేశంలో వాణిజ్య వాహ‌నాల‌ను తయారుచేసే వాటిలో శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఒక పెద్ద కంపెనీ. దేశంలో అతిపెద్ద అసెట్ ఫైనాన్సింగ్ ఎన్ఎబీఎఫ్‌సీ కూడా ఇదే. 1979లో ఇది త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. వాహనాన్ని ర‌వాణా చేసేందుకు అయ్యే ఖ‌ర్చుపై రాయితీనివ్వ‌డంతో పాటు, కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల‌ను సైతం ఈ సంస్థ ఇస్తోంది. గ‌త కొన్నేళ్లుగా కంపెనీ లాభాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఎన్నో సంవ‌త్స‌రాలుగా కంపెనీ డివిడెండ్ల‌ను చెల్లిస్తోంది. ఈ కంపెనీ ఎప్‌డీల‌కు క్రిసిల్ ఎప్ఏఏఏ రేటింగ్ ఇచ్చింది. అంటే దీన‌ర్థం కంపెనీ ఎఫ్‌డీలు సుర‌క్షిత‌మైన‌వ‌ని.

శ్రీ‌రామ్ ఫైనాన్స్ ఉన్న‌తి ఎఫ్‌డీలు

శ్రీ‌రామ్ ఫైనాన్స్ ఉన్న‌తి ఎఫ్‌డీలు

ఈ కంపెనీ 5 ఏళ్ల ఎఫ్‌డీల‌పై 8.50% వ‌డ్డీ రేటును ఇస్తోంది. 4 ఏళ్ల ఎఫ్‌డీల‌పై 8.45% వ‌డ్డీ రావొచ్చు. అదే 3 ఏళ్ల కాల‌ప‌రిమితి ఎఫ్‌డీల‌పై ఇచ్చే వ‌డ్డీ 8.25% గా ఉంటోంది. ఈ డిపాజిట్ల‌పై టీడీఎస్ ఉంటుంద‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాలి. వ‌డ్డీ ఆదాయం రూ. 5000 దాటితే కంపెనీ ఎఫ్‌డీల‌కు టీడీఎస్ అమ‌ల‌వుతుంది. కాబట్టి దీన్నిగుర్తుంచుకొని వ‌చ్చే ఆదాయాన్ని, రాబ‌డిని బ‌ట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి.

బ‌జాజ్ ఫైనాన్స్‌

బ‌జాజ్ ఫైనాన్స్‌

బ‌జాజ్ ఫైనాన్స్ సంస్థ నుంచి వ‌చ్చే ఎఫ్‌డీల‌కు ఏఏఏ రేటింగ్ ఉంది. అంటే ఈ సంస్థ ప్రవేశ‌పెట్టే ఎఫ్‌డీలు స్థిర‌మైన‌వి, సుర‌క్షిత‌మైన‌వి. అన్ని కాల‌ప‌రిమితి ఎఫ్‌డీల్లోనూ ఈ కంపెనీ 8.25% వ‌డ్డీ రేటును ఇవ్వ‌జూపుతోంది. క‌నీస డిపాజిట్ రూ. 75 వేల నుంచి మొద‌ల‌వుతుంది. రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే అద‌నంగా 0.25% వ‌డ్డీ వ‌స్తుంది. ఈ సంస్థ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పెట్టుబ‌డిదారులు నిర‌భ్యంత‌రంగా, నిస్సందేహంగా ఎంచుకోవ‌చ్చు. ఎందుకంటే బ్యాంకుల ఎఫ్‌డీలు మీకు 8.25% వ‌డ్డీ రేటును అందించ‌లేవు.

కేటీడీఎఫ్‌సీ

కేటీడీఎఫ్‌సీ

కేర‌ళ ప్ర‌భుత్వం హామీగా కేటీడీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ హామీ ఉంటుంది కాబ‌ట్టి ఇవి సుర‌క్షిత‌మైన‌వి. 1,2,3 ఏళ్ల కాలప‌రిమితి డిపాజిట్ల‌కు 8.25% వ‌డ్డీ వ‌స్తుంది. ఏడాది కాలానికి చూస్తే 8.25% కాస్త త‌గ్గిందనే చెప్పాలి. కేర‌ళ ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్నందున దీని రేటింగ్‌ల‌ను స‌రిచూడాల్సిన అవ‌స‌రం లేదు.

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌

మిగిలిన వాటి లాగా మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఇవ్వ‌ట్లేదు. కొన్ని నెల‌ల క్రితం అన్నింటి కంటే ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఇచ్చేది. ప్ర‌స్తుతం 1 ఏడాది డిపాజిట్ల‌కు 7.90%; 2 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌కు 8%, మిగిలిన కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌కు 8.05% వ‌డ్డీ రేట్ల‌ను ఆఫ‌ర్ చేస్తున్నారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా సుర‌క్షిత‌మైన‌వి. డీఫాల్ట్ అయ్యేందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.

డిస్‌క్లెయిమ‌ర్‌:

డిస్‌క్లెయిమ‌ర్‌:

కంపెనీ ఎఫ్‌డీలు బ్యాంకు ఎఫ్‌డీల‌తో పోల్చి చూసిన‌ప్పుడు కాస్త రిస్క్‌తో కూడుకున్న‌వి. ఈ క‌థంన ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో కానీ లేదా మ‌రే ఇత‌ర ఆర్థిక సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం, విత్‌డ్రా చేయ‌డం చేయ‌కూడ‌దు. ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల స‌ల‌హా తీసుకుని మీ పెట్టుబ‌డుల‌ను పెట్టాల్సిందిగా సూచిస్తున్నాం. గ్రేనియ‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీస్ ప్రైవేటు లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థ‌లు, ర‌చ‌యిత, సంస్థ యాజ‌మాన్యం, ఉద్యోగులు మీకు వ‌చ్చే న‌ష్టాలకు బాధ్యులు కారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+