సులభతర వ్యాపార నిర్వహణలో తెలుగు రాష్ట్రాలు టాప్
తెలుగు రాష్ట్రాలు రెండూ సులభతర వ్యాపార నిర్వహణలో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. సరిగ్గా చెరో 98.78 శాతం మార్కులు సాధించి ఒకటో నంబరు మీద ఉమ్మడిగా నిలిచాయి. మరో వైపు ఆశ్చర్యకరంగా ప్రధ
తెలుగు రాష్ట్రాలు రెండూ సులభతర వ్యాపార నిర్వహణలో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. సరిగ్గా చెరో 98.78 శాతం మార్కులు సాధించి ఒకటో నంబరు మీద ఉమ్మడిగా నిలిచాయి. మరో వైపు ఆశ్చర్యకరంగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఒకటి నుంచి మూడో స్థానానికి దిగజారింది. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒకటో స్థానానికి రాగా, 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి సాటి సత్తా చాటింది. చురుగ్గా వ్యాపార సంస్కరణలు అమలు చేయటం ద్వారా రెండు రాష్ట్రాలు ఈ ఘనతను సాధించాయి. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర వాణిజ్య శాఖ, పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తెలుగు రాష్ట్రాలు సమిష్టిగా మొదటి స్థానం సాధించాయి. సులభంగా వ్యాపారం చేసుకునే అవకాశాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ప్రతిబింబించే.. పది రంగాలకు చెందిన 340 అంశాలతో కూడిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బీఆర్‌ఏపీ)ను 2015 జూలై 1వ తేదీ నుంచి 2016 జూన్ 30వ తేదీ వరకు అమలు చేయటంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని అధ్యయనం చేసి మార్కులు వేశారు.

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ప్రపంచ బ్యాంకు భారతదేశ విభాగాధిపతి జునైద్ అహ్మద్‌ల సమక్షంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన సోమవారం ఈ ర్యాంకుల్ని ఢిల్లీలో విడుదల చేశారు. వ్యాపార నియంత్రణా ప్రక్రియలు, విధానాలు, సంప్రదాయాలు, ప్రక్రియలకు సంబంధించిన పలు సంస్కరణలు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు, కొత్తగా చేపట్టాల్సిన చర్యలు ఈ 340 అంశాల్లో ఉన్నాయి. ఆయా అంశాలను అమలు చేసినట్లుగా సంబంధిత రాషా్ట్రలు రుజువుల్ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం ప్రారంభించింది. 7124 సంస్కరణలు అమలు చేస్తున్నట్లుగా 32 రాషా్ట్రలు రుజువుల్ని సమర్పించాయి. ఈ రుజువుల్ని ప్రపంచ బ్యాంకు, డీఐపీపీ బృందాలు అధ్యయనం చేసి, ప్రణాళికకు అనుగుణంగా సంస్కరణలు అమలవుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించాయి. దేశవ్యాప్తంగా 29 రాషా్ట్రలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలసి సగటున 48.93 శాతం మార్కుల్ని సాధించాయి. గతేడాది గుజరాత మొదటి స్థానం పొందగా 70.12 శాతం మార్కులతో ఆంధ్రప్రదేశ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం 42..45 శాతం మార్కులతో 13వ స్థానం దక్కించుకుంది. ఏడాదికాలంలో తెలంగాణ తన పనితీరును బాగా మెరుగుపర్చుకుంది. ఏకంగా 12 స్థానాలు పైకి ఎగబాకింది. సంస్కరణల అమలులోను, పెట్టుబడులకు అవకాశాలను కల్పించటంలోనూ దేశంలో మిగతా రాషా్ట్రలను వెనక్కు నెట్టి ఈ ఏడాది మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రణాళికలో పేర్కొన్న 340 అంశాల్లో 324 అంశాలను తెలంగాణ అమలు చేస్తోంది. 12 అంశాలు రాషా్ట్రనికి వర్తించవు. కేవలం నాలుగు అంశాలను మాత్రమే అమలు చేయటం లేదు. మొత్తంగా ఈ ఏడాది తెలంగాణ 98.78 శాతం మార్కులు సాధించి అగ్రభాగాన నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ సైతం తెలంగాణతో సమానంగా మార్కులు సాధించి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ గతేడాది రెండోస్థానంలో నిలవగా.. ఒక స్థానం మెరుగుపర్చుకుని ఈ ఏడాది మొదటి స్థానం దక్కించుకుంది. 90-100 శాతం మార్కులు సాధించిన రాషా్ట్రలను లీడర్స్‌గా కేంద్రం గుర్తించింది. ఆంధ్రప్రదేశ, తెలంగాణలతో పాటు గుజరాత, చత్తీశగఢ్, మధ్యప్రదేశ, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌లు లీడర్స్ విభాగంలో ఉన్నాయి. 70-90 శాతం మార్కులు సాధించిన కర్నాటక, ఉత్తరప్రదేశ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లను ఎమర్జింగ్ స్టేట్స్‌గా పేర్కొన్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన విభాగంలో హిమాచల్ ప్రదేశ, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. సంస్కరణల్ని వేగంగా అమలు చేయాల్సిన రాషా్ట్రల విభాగంలో కేరళ, గోవా, జమ్మూ కాశ్మీర్ సహా 17 రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications