టెక్ మహీంద్రా లాభాలు తగ్గాయ్
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభాలు 19.2 శాతం క్షీణించి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జి
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా లాభాల్లో పడిపోయింది. 2016 ఆర్థికసంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభాలు 19.2 శాతం క్షీణించి, కేవలం రూ.643.4 కోట్ల నికరలాభాలను మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఈ లాభాలు రూ.780.3 కోట్లగా ఉన్నాయి. త్రైమాసిక ఫలితాల్లో నిర్వహణ కార్యకలాపాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయాలు 8% ఎగిసి రూ.7,167.4 కోట్లగా నమోదైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఈ ఆర్థిక త్రైమాసికంలో తమ పనితీరు, కొత్త సాంకేతిక అంశాల్లో తాము పెట్టిన పెట్టుబడుల, సామర్థ్యాల ఫలితమేనని టెక్ మహింద్రా వైస్ చైర్మన్ వినీత్ నాయర్ వెల్లడించారు. డాలర్ విలువలో ఆర్జించే పీఏటీలు(పన్నుల అనంతర లాభాలు) యేటికేటికీ 18.2 శాతం పడిపోయి, 96.5 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ తమకు మంచి త్రైమాసికమేనని, కీలకమైన కమ్యూనికేషన్, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌లు వృద్ధిని నమోదుచేయడానికి దోహదం చేశాయని కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications