For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైర‌స్ మిస్త్రీ ఈ-మెయిల్ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు

సైర‌స్ మిస్త్రీ మెయిల్ త‌ర్వాత నియంత్ర‌ణ సంస్థ‌లు స్పందించాయ‌ని న్యూస్ ఏజెన్సీ రాయిట‌ర్స్ నివేదించింది. సైర‌స్ మిస్త్రీ టాటా గ్రూపుకు రాసిన లేఖ బ‌హిర్గ‌త‌మ‌వ్వ‌డంతో టాటా గ్రూపున‌కు చెందిన లిస్టెడ్ కంప

|

సైర‌స్ మిస్త్రీ మెయిల్ త‌ర్వాత నియంత్ర‌ణ సంస్థ‌లు స్పందించాయ‌ని న్యూస్ ఏజెన్సీ రాయిట‌ర్స్ నివేదించింది. సైర‌స్ మిస్త్రీ టాటా గ్రూపుకు రాసిన లేఖ బ‌హిర్గ‌త‌మ‌వ్వ‌డంతో టాటా గ్రూపున‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల నుంచి వివ‌ర‌ణ కోరుతూ దేశీయ ఎక్స్చేంజీలు రెండు వివ‌ర‌ణ అడిగాయి. సెబీ సైతం స‌విర‌మైన నివేదిక‌ను టాటా గ్రూపు సంస్థ‌ల నుంచి కోరింది. ఈ నేప‌థ్యంలో సైర‌స్ మిస్త్రీ ఈ-మెయిల్ త‌ర్వాత జ‌రిగిన స‌త్వ‌ర ప‌రిణామాలేంటో తెలుసుకుందాం.

స్టాక్ ఎక్స్చేంజీ

స్టాక్ ఎక్స్చేంజీ

1. స్టాక్ ఎక్స్చేంజీల‌కు టాటా స్టీల్ స‌మ‌ర్పించిన నివేదిక‌లో అన్ని నియ‌మాల‌ను స‌క్ర‌మంగా పాటిస్తున్నామ‌ని, ఫైనాన్సియ‌ల్ స్టేట్‌మెంట్లు సైతం స‌రిగానే ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. టాటా ప‌వ‌ర్‌, ఇండియ‌న్ హోట‌ల్స్ సైతం ఇదే విధమైన స‌మాధానాల‌ను ఇచ్చాయి.

 గ్రూపు విలువ 103 మిలియ‌న్ డాల‌ర్లు

గ్రూపు విలువ 103 మిలియ‌న్ డాల‌ర్లు

2. టాటా గ్రూప్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి 48 ఏళ్ల మిస్త్రీని అకస్మాత్తుగా తొల‌గించారు. టాటా గ్రూపు విలువ 103 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగానే ఉంది. ఈ రెండు, మూడు రోజుల్లో గ్రూపుకు చెందిన వేల కోట్ల సంప‌ద ఆవిర‌వుతోంది.

మిస్త్రీ కార్యాల‌యం

మిస్త్రీ కార్యాల‌యం

3. బోర్డు నిర్ణ‌యాన్ని స‌వాలు చేయ‌డానికి ఎటువంటి ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డం లేద‌ని సైర‌స్ మిస్త్రీ కార్యాల‌యం తెలిపిన‌ప్ప‌టికీ, బోర్డు మెంబ‌ర్ల‌కు రాసిన లేఖ‌లో త‌న తొల‌గింపు అనైతిక‌మ‌ని అన్నారు.

 బోర్డుకు లేఖ‌

బోర్డుకు లేఖ‌

4. ఈ-మెయిల్‌లో బోర్డుకు పంపిన సందేశంలో ఐదు కంపెనీల గురించి ప్ర‌స్తావించారు. ఈ ఐదు కంపెనీలు క‌లిసి 18 బిలియ‌న్ డాల‌ర్ల విలువ‌ను న‌ష్ట‌ప‌రిచాయ‌ని పేర్కొన్నారు.

మిస్త్రీ ఆరోప‌ణ‌లు

మిస్త్రీ ఆరోప‌ణ‌లు

5. అతిపెద్ద స్వాధీనాల కార‌ణంగా కార్పొరేట్ మిస్‌గ‌వ‌ర్నెన్స్‌తో పాటు, ఫైనాన్సియ‌ల్‌గా త‌ప్పుదోవ ప‌ట్టించే అంశాలు చోటు చేసుకున్నాయ‌ని మిస్త్రీ ఆరోపించారు.

 ఒత్తిడికి గుర‌వుతున్న షేర్లు

ఒత్తిడికి గుర‌వుతున్న షేర్లు

6. స్టాక్ మార్కెట్లో వ‌రుస‌గా మూడో రోజు టాటా గ్రూపు షేర్లు ఒత్తిడికి గుర‌వుతున్నాయి. ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో టాటా టెలిసర్వీసెస్‌(9%), ఇండియ‌న్ హోట‌ల్స్ (4%) ఉన్నాయి. ఈ రోజు టాటా ప‌వ‌ర్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్ 1 నుంచి 2 శాతం న‌ష్ట‌పోయాయి.

నానో ప్రాజెక్టు

నానో ప్రాజెక్టు

7. ప‌ని తీరు కార‌ణంగా న‌న్ను తొల‌గించార‌నే వాద‌న‌ను నేను విశ్వ‌సించ‌ను అని సైర‌స్ మిస్త్రీ లేఖ‌లో ప్ర‌స్తావించారు.టాటా గ్రూపుకు నానో కారు పెద్ద ప్ర‌తిబంధ‌కంగా త‌యారైంద‌ని మిస్త్రీ త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇప్ప‌టికిప్పుడు నానో ప్రాజెక్టును ఆపేస్తే ర‌త‌న్ టాటా వాటా క‌లిగిన ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్న ఒక సంస్థ‌కు నానో గ్లైడ‌ర్ల స‌ర‌ఫ‌రా ఆగిపోతుంద‌ని ఆయ‌న అన్నారు.

 ప‌నితీరు

ప‌నితీరు

సైర‌స్ మిస్త్రీ చేస్తున్న ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని టాటా లాయ‌ర్ అభిషేక్ మ‌ను షింఘ్వీ చెప్పారు. అత‌ని తొల‌గింపు ఆర్థిక‌, నైతిక‌, యాజ‌మాన్య కార‌ణాల‌తో ముడిప‌డింద‌ని తెలిపారు. ర‌త‌న్ టాటా ఒక్క‌రి ద‌గ్గరి నుంచే కాకుండా మొత్తం బోర్డు విశ్వాసాన్ని సైర‌స్ కోల్పోయార‌ని షింఘ్వీ అన్నారు.

టాటా స‌న్స్ స్పంద‌న‌

టాటా స‌న్స్ స్పంద‌న‌

సైరస్‌ మిస్త్రీ లేఖపై టాటా సన్స్‌ ఘాటుగానే స్పందించింది. ద్వేషపూరితమైన ఆరోపణలు చేయడం సరికాదని.. గ్రూపును నిర్వహించడం కోసం పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చామని టాటా సన్స్‌ పేర్కొంది. అయితే బోర్డు సభ్యుల విశ్వాసాన్ని పొందడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది.

లేఖ బ‌య‌ట‌కు రావ‌డంపై

లేఖ బ‌య‌ట‌కు రావ‌డంపై

అదే సమయంలో బోర్డు సభ్యులకు మాత్రమే రాసిన ఆ (కాన్ఫిడెన్షియల్‌) లేఖ బయటకు వచ్చింది. ఇలా రావడం గౌరవప్రదమైన నడవడిక కానే కాదని పేర్కొంది. మిస్త్రీ తన పదవీ కాలంలో పలుమార్లు గ్రూపులోని సంప్రదాయాలకు,విలువలకు తిలోదకాలు ఇచ్చారని అంటోంది.

Read more about: cyrus mistry tata group tata
English summary

సైర‌స్ మిస్త్రీ ఈ-మెయిల్ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు | What happened after Cyrus mistry mail to the board

The country's two largest stock exchanges have demanded clarity from the Tata group's 27 listed companies after a lengthy email written by former chairman Cyrus Mistry became public, reports news agency Reuters. Markets regulator Sebi too is reportedly looking into these companies
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X