నష్టాల్లో వూబిలో కూరుకుపోయిన ట్విట్టర్.. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కొన్ని ఉద్యోగాలకు కోత విధించనుంది. దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించేం
నష్టాల్లో వూబిలో కూరుకుపోయిన ట్విట్టర్.. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కొన్ని ఉద్యోగాలకు కోత విధించనుంది. దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్విటర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గురువారం ఆ సంస్థ మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్నాయి. దీని కంటే ముందే ఉద్యోగులను తొలగించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొంతకాలంగా ట్విటర్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. అంతేగాక, గత 12 నెలల్లో ట్విటర్ షేర్ ధరలు 40శాతం వరకు పడిపోయాయి. దీంతో కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడంతో అమ్మకానికి సైతం సిద్ధపడింది. అయితే ఇందుకోసం వాల్ట్ డిస్నీ, గూగుల్, సేల్స్‌ఫోర్స్ లాంటి సంస్థలు బిడ్డింగ్‌పై ఆసక్తి చూపించినప్పటికీ.. చివరి నిమిషంలో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications