ఐటీ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు
టీసీఎస్ లాభం రూ. 6585 కోట్లు

దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ. 6586 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ. 6317 కోట్లుగా ఉంది. ఫలితాలపై సీఈవో చంద్రశేఖరన్ మాట్లాడుతూ, " ఈ త్రైమాసికం టీసీఎస్‌కు అసాధారణమైనది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత కారణంగా క్లయింట్లు ఖర్చుచేయడంలో ఆచితూచి వ్యవహరించారు. ఇండియా, లాటిన్ అమెరికా మార్కెట్లలో వోలటైలిటీ కారణంగా రెవన్యూ వృద్దిపై ప్రభావం పడింది. లాభాల పరంగా చూస్తే ఇది మంచి త్రైమాసికమే. ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ నిర్వహణపై పద్దతి ప్రకారం దృష్టి పెట్టడం వల్ల అనుకున్న మార్జిన్లను సాధించగలిగాం" అని చెప్పారు.
ఇది కూడా చదవండి దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలు
తగ్గిన సెయింట్ నికర లాభం
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సెయింట్ రూ. 97.25 కోట్ల నికర లాభాన్నిప్రకటించింది. గత త్రైమాసికంలో ఈ నికర లాభం రూ. 73.97 కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో మొత్తం నిర్వహణ ఆదాయం 9.4% పెరిగి రూ. 914 కోట్లుగా ఉంది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది రూ. 835 కోట్లుగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 14% పెరిగిందని సెయింట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలోని క్యూ2లోని రూ. 772 కోట్ల నుంచి దాదాపు 18% వృద్దితో రూ. 914 కోట్లకు పెరిగింది.
అంచనాలను మించిన ఇన్ఫోసిస్

సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి ఇన్ఫోసిస్ రాణించింది. క్యూ2లో రూ. 3603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం రూ. 17,310 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికానికి కంపెనీ ఆదాయం రూ. 16,782 కోట్లుగా ఉంది. ఇన్ఫీ తన రెవెన్యూ అంచనాలను గత త్రైమాసికంలో 11.5-13.5% తగ్గించగా ప్రస్తుతం మరింత తగ్గించి 10.5-12% గా ఉంచింది. ఒక్కో షేరుపై రూ. 11 మధ్యంతర డివిడెండు చెల్లించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
టీసీఎస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 4% పెరగ్గా, ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 7% పెరిగింది.
Read in Kannada: ಇನ್ಫೋಸಿಸ್ ಸಿಒಒ, ಸಿಎಫ್ಒ ಸಂಬಳ ಏರಿಕೆ!


Click it and Unblock the Notifications