సెన్సెక్స్ దిగువకు, రూపాయి మూడు నెలల కనిష్టానికి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఈ రోజు మార్కెట్లు దాదాపుగా నష్టాల్లోనే పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 439(-1.56) పాయింట్ల నష్టంతో 27,643 వద్ద ముగియగా; నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 135.45(-1.56) పాయింట్ల నష్టంతో 8573.35 పాయింట్ల వద్ద ముగిసింది.
చైనా సెప్టెంబర్ ట్రేడ్ సమాచారం ప్రకారం ఎగుమతుల్లో క్షీణత ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యేందుకు కారణమైంది. దీంతో పాటు అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మూడు వారాల కనిష్టానికి వెళ్లడం, సమీప భవిష్యత్తులో ఫెడ్ రేట్లను పెంచేందుకు అవకాశాలున్నాయన్న సంకేతాలు సైతం భారత్ సహా ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యేందుకు కారణాలయ్యాయి.
నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 39 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి.
3.00 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్ల నష్టంలోనూ, నిఫ్టీ 149 పాయింట్ల(-1.71%)నష్టంలోనూ కొనసాగుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలో లాభాల్లో,నష్టాల్లో ఉన్న కంపెనీల జాబితా కింద చూడండి.

సెన్సెక్స్ లాభాల్లో ఉన్నవి
సెయింట్ (11.52%)
జస్ట్‌డయల్(4.57%)
జేకేటైర్(3.99%)
పెట్రోనెట్(2.96%)
బేయర్‌కార్ప్(2.85%)
సెన్సెక్స్ నష్టాల్లో ఉన్నవి
జే&కే బ్యాంకు(-14.12%)
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ(-5.39%)
టీవీ18బ్రాడ్‌కాస్ట్(-5.35%)
డిష్‌టీవీ(-5.18%)
EIDPARRY (-5.17%)
నిఫ్టీలో లాభాల్లో ఉన్నవి
ఓఎన్‌జీసీ(1.99%)
ఇన్ఫీ(1.96%)
మారుతి(0.54%)
సిప్లా(0.37%)
హీరోమోటోకార్ప్(0.32%)
నిఫ్టీలో నష్టాల్లో ఉన్నవి
బ్యాంక్ ఆఫ్ బరోడా(-4.88%)
అదానీ పోర్ట్స్(-4.75%)
ఐడియా(-4.70%)
అరోఫార్మా(AUROPHARMA)(-4.06%)
హెచ్‌డీఎఫ్‌సీ (-3.99%)
70కి దగ్గర్లో రూపాయి
డాలరుతో రూపాయి విలువ ఒక దశంలో 43 పైసలు కోల్పోయి ప్రస్తుతం 38 పైసల(0.57%) నష్టంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications