అమెరికా ధ‌న‌వంతుల జాబితాలో మ‌నోళ్లు 5 మంది

అమెరికాలోని 400 మంది సంపన్నులతో ఫోర్బ్స్ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో 5 మంది ప్రవాస భారతీయులకు చోటు లభించింది. సింఫోనీ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు రోమేష్‌ వాద్వానీ (222వ స్థానం- నెట్‌వర్త్‌ 300 కోట్ల డాలర్లు), సింటెల్‌ సహ వ్యవస్థాపకుడు భ‌ర‌త్ దేశాయ్‌ (274వ స్థానం - నెట్‌వర్త్‌ 250 కోట్ల డాలర్లు), ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్‌ గంగ్వాల్‌ (321వ స్థానం, 220 కోట్ల డాలర్లు), ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌ జాన్‌ కపూర్‌ (335వ స్థానం - నెట్‌వర్త్‌ 210 కోట్ల డాలర్లు), సిలికాన్‌ వ్యాలీ ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ కవిటార్క్‌ రామ్‌ శ్రీరామ్‌ (361వ స్థానం - నెట్‌వర్త్‌ 190 కోట్ల డాలర్లు)లు ఈ జాబితాలో చోటు సం పాదించుకున్నారు. ఒక్కొక్క‌రి ప్ర‌స్థానం గురించి కింద చ‌ద‌వండి

బిల్‌గేట్స్‌

బిల్‌గేట్స్‌

60 ఏళ్ల బిల్‌గేట్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ప్ర‌స్థానం ఆరంభించిన గేట్స్ ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొంటున్నారు. గత 23 ఏళ్లుగా ఈయనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండటం విశేషం. ఈయన సంపద 8100 కోట్ల డాలర్లు. పుట్టుక‌తో వచ్చే పోలియోను నివారించేందుకు కృషి చేయ‌డంతో పాటు, మ‌లేరియా, చిన్న పిల్లల వ్యాక్సిన్ల‌కు సంబంధించి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేష‌న్ త‌ర‌పున అవిర‌ళ కృషి చేస్తున్నారు.

రోమేష్‌ వాద్వానీ

రోమేష్‌ వాద్వానీ

సింఫనీ టెక్నాలజీ గ్రూపునకు చైర్మన్, సిఇఒ అయిన రోమేష్‌ వాద్వానీ ఐఐటి ముంబై పట్టభద్రుడు. ఆయన కార్నిగే మెలాన్ విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్‌డి చేశారు. కాలిఫోర్నియాకు చెందిన ఈయన 1991లో యాస్పెక్ట్ అనే కంపెనీ ఏర్పాటు చేశాడు. టెక్ బబూల్ కాలంలో ఈ కంపెనీని 930 కోట్ల డాలర్లకు ఐ2 టెక్నాలజీస్ విక్రయించి ఆ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో కెక్కారు. ఇండియాలో వ్య‌వ‌స్థాప‌క‌త‌ను ప్రోత్స‌హించేందుకు 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు పెట్ట‌నున్న‌ట్లు గ‌తేడాది వాద్వానీ వెల్ల‌డించారు.

 భ‌ర‌త్ దేశాయ్‌

భ‌ర‌త్ దేశాయ్‌

ఐఐటి ముంబై నుంచి పట్టా పుచ్చుకుని టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌లో 1976లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేశాయ్.. తన భార్య నీరజ్ సేథీ కలిసి ఔట్‌సోర్సింగ్ ఫర్మ్ సింటెల్‌ను ప్రారంభించారు. గత సంవత్సరం ఆయన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి వైదొలగినప్పటికీ, చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫ్లోరిడాలో ఉంటున్న దేశాయ్ గత సంవత్సరం డీప్ వాల్యు హెడ్జ్ ఫండ్‌ను ప్రారంభించారు. 1994లో ఇండియా తరఫున బ్రిడ్జ్ వరల్డ్ చాంపియ న్ షిప్‌ను ఆడిన దేశాయ్, భారత్ తరఫున కిక్రెట్ ఆడలేకపోవటం తన జీవితంలో అతిపెద్దలోటని వ్యాఖ్యానించారు. సింటెల్‌లో ప్ర‌స్తుతం 24 వేల‌కు పైగా ఉద్యోగులు ఉన్న‌ట్లు ఫోర్బ్స్ వెల్ల‌డించింది.సింటెల్ కంఎనీ రెవెన్యూ 950 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఉంది.

రాకేశ్ గంగ్వాల్‌

రాకేశ్ గంగ్వాల్‌

యూఎస్ ఎయిర్‌వేస్ గ్రూపుకు సీఈవోగా ర‌మేశ్ గంగ్వాల్ ప‌నిచేశారు. జూన్ 2003 నుంచి ఆగ‌స్టు 2007 వ‌ర‌కూ వ‌ర‌ల్డ్‌స్పాన్ టెక్నాల‌జీస్ సీఈవోగా, అధ్య‌క్షుడిగా, చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. 1953లో క‌ల‌క‌త్తా న‌గ‌రంలో ఆయ‌న జ‌న్మించారు. యూఎస్ ఎయిర్‌వేస్‌లో చేర‌క‌ముందు 1994 న‌వంబ‌రు నుంచి ఎయిర్‌ఫ్రాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు.

జాన్ క‌పూర్‌

జాన్ క‌పూర్‌

జాన్ క‌పూర్ 2.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో 335వ స్థానం సంపాదించాడు. ఆయ‌న కుటుంబంలో కాలేజీకి వెళ్లిన మొద‌టి వ్య‌క్తి ఆయ‌నే. త‌ర్వాత అమెరికాకు వెళ్లి మెడిసిన‌ల్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ ప‌ట్టా పొందారు. అక్రోన్ అనే సంస్థ‌కు, ఇన్సిస్ థెర‌ప్యాటిక్స్ అనే సంస్థ‌ల‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

క‌విటార్క్ రామ్ శ్రీ‌రామ్‌

క‌విటార్క్ రామ్ శ్రీ‌రామ్‌

190 కోట్ల డాల‌ర్ల‌తో 361 వ స్థానంలో రామ్ శ్రీ‌రామ్ నిలిచారు. భార‌త‌దేశంలో జ‌న్మించిన శ్రీ‌రామ్ గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌లో బోర్డ్ ఆఫ్ మెంబ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ద్రాస్ విశ్వ‌విద్యాల‌యంలో గ‌ణితంలో ప‌ట్టా పుచ్చుకున్న ఆయ‌న త‌ర్వాత అమెరికాకు వెళ్లారు. 1994లో నెట్‌స్కేప్‌లో ఎగ్జిక్యూటివ్‌గా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు. త‌ర్వాత అమెజాన్ వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. త‌న షెర్పాలో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ద్వారా 2000 సంవ‌త్స‌రం నుంచి ప‌లు స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్నారు. పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌ల జాబితా పేప‌ర్‌లెస్ పోస్ట్‌, అప్టిమైజ్‌లీ, ఇన్‌మొబి మొద‌లైన‌వి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+