వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకులు
ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.దీంతో రెపో రేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గింది. నిజానికి బ్యాంకులకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఏర్పడింది. అయితే కొన్ని బ్యాంకులు తక్షణమే వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గించగా కొన్ని ఇంకా వేచిచూస్తున్నాయి. రుణ గ్రహీతలకు ప్రస్తుతం వడ్డీలు ప్రకటించేటప్పుడు బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్‌ను అనుసరిస్తున్నాయి. బ్యాంకులు తగ్గించిన వడ్డీ రేట్లను కింద చూడొచ్చు

బేస్‌రేట్లను(వడ్డీ రేట్లను) తగ్గించిన కొన్ని బ్యాంకులు
1) ఐసీఐసీఐ బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది రుణాలకు 9.05% వద్ద, నెల,త్రైమాసిక రుణాలకు 8.85% వద్ద వడ్డీ రేట్లను ఉంచింది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
2) కొటక్ మహీంద్రా బ్యాంకు
కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేట్లను 0.1% తగ్గించింది. బేస్‌రేట్ (వడ్డీ రేటు) 9.50 నుంచి 9.40% కి తగ్గింది.
3) కెనరా బ్యాంకు
కెనరా బ్యాంకు వడ్డీ రేట్లను 0.05% తగ్గించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు 9.65 శాతం నుంచి 9.60శాతానికి తగ్గాయి. దీన్ని అక్టోబర్ 11 నుంచి అమలుపరచనున్నారు.
4)ఇండియన్ బ్యాంకు
ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడంతో ఇండియన్ బ్యాంకు రుణాల రేట్లను 0.1% మేర తగ్గించింది. దీంతో ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేట్లు 9.45% నుంచి 9.35% కి తగ్గాయి. ఇది అక్టోబర్ 7 నుంచి వర్తిస్తుంది. మిగిలిన కాలపరిమితి ఉన్న రుణాలకు వడ్డీ రేట్లను 0.05 శాతం మేర మాత్రమే తగ్గించారు.
5) కరూర్ వైశ్యా బ్యాంకు
కరూర్ వైశ్యా బ్యాంకు వడ్డీ రేట్లను 0.35% తగ్గించింది.
6) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ వడ్డీ రేట్లను 0.15% మేర తగ్గించింది.
7) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 0.05% తగ్గించినప్పటికీ, అవి అక్టోబర్ 17 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఏడాది కాలపరిమితి రుణాల వడ్డీ రేట్లు 9.45% నుంచి 9.40% కి తగ్గాయి. అదే సమయంలో 6 నెలల కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు 9.40% నుంచి 9.35% కి తగ్గాయి.


Click it and Unblock the Notifications