ప్రతిసారి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి ఏదో విధంగా చైనా ఇన్‌వాల్వ్‌మెంట్ కనిపిస్తూ ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పలు మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున చైనా నిర్మిస్తూ వస్తోంది. మరో వైపు భారత్ సింధూ నది ఒప్పందంపై సమీక్ష జరపబోతుందన్న వార్తలు వచ్చినప్పుడే చైనా బ్రహ్మపుత్ర ఉపనదిపై జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు నీటిని ఆపేసింది. ఇలా పలు కారణాల వల్ల భారతీయుల్లో చైనా దేశంపై కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా చైనా ఉత్పత్తులు వాడకూడదని ప్రచారం జరుగుతోంది. మరో వైపు చైనా ప్రాడక్టులకు మనం ఎంతగా అలవాటు పడ్డామంటే చిన్న లైటర్ నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. చాలా జిల్లా కేంద్రాల్లో వీధికో చైనా బజార్ ఉంటుంది. అంతెందుకు మీలో చాలా మంది చైనా మొబైల్‌లోనో, చైనా ల్యాప్‌ట్యాప్‌లోనో వార్తలు చదువుతూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో Made in China ప్రాడక్టుల నిషేధ ప్రచారంపై పలు అంశాలను తెలుసుకుందాం.

పాక్‌కు వెనుక నుంచి మద్దతు
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేసే విషయంలో ఇండియాకు చైనా సహకరించలేదు సరికదా ప్రతి అంశంలో పాకిస్థాన్‌ను వెనుక నుంచి కాపాడుతూ వస్తోంది. మరో వైపు ఆగస్టు నెలలో వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం వైపు నుంచి కొన్ని చర్యలు ఉంటాయని చెప్పింది. ఎందుకంటే చైనా నుంచి మనం చేసుకునే దిగుమతుల వల్ల చాలా మంది చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

సోషల్ మీడియాలో ఆగ్రహం
జైషే మహ్మద్ అధిపతి మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ముద్ర వేసే విషయంలో చైనా ప్రభుత్వం మోకాలడ్డింది. ఇది ప్రపంచ దేశాల్లో చాలా వాటికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మసూద్ అజర్‌ను ఎప్పటినుంచే ఉగ్రవాదిగా భావిస్తోంది. అంతే కాకుండా ఇటీవల జరిగిన ఉరీ ఉగ్ర దాడుల వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాదుల హస్తం ఉందని ఇండియా బలంగా నమ్ముతోంది. దాంతో పాటు చైనా బ్రహ్మపుత్ర ఉపనదిపైన ఆనకట్ట కట్టేందుకు నీటిని ఆపడం చాలా మంది భారతీయులకు ఆగ్రహం తెప్పించింది.

ఇప్పటికే ట్రేడ్‌పై ప్రభావం
వాట్సప్, ఫేస్‌బుక్‌లో విపరీతంగా జరుగుతున్న ప్రచారం కారణంగా హోల్‌సేలర్ల దగ్గర ఇప్పటికే చైనా దిగుమతులు 20% తగ్గాయనేది అనధికారిక అంచనా. చైనాకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తే అది ఇరుదేశాల వర్తకంపై తీవ్ర ప్రభావమే చూపగలదని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ఖండేల్‌వాల్ చెప్పారు. దేశమంతా ఈ విషయంలో ఉద్విగతకు గురికావడం వల్ల మార్కెట్‌పై ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. చైనా ఉత్పత్తులు తక్కువ ధరలో రావడం వల్ల ఇండియా పెద్ద మార్కెట్‌గా తయారయింది. దిల్లీ పరిసర ప్రాంతాల్లోనే ప్రస్తుతం 1000 కోట్ల రూపాయల చైనా ఉత్పత్తుల వ్యాపారంపై ప్రభావం పడిందని అంచనా. అదే విధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది.

ఉత్పత్తులేంటి?
ఈ ఉత్పత్తులో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఫ్యాన్సీ లైట్స్, గిఫ్ట్ ఐటెమ్స్, ప్లాస్టిక్ వస్తువులు, డెకరేటివ్ వస్తువులు ఉన్నాయి. చాలా మంది వినియోగదారులు దేశీయ వస్తువుల కోసం అడుగుతున్నారని రిటైలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మందికి దీపావళి సమయంలో చైనా టపాసులు కొనడం అలవాటు. ఇటీవల చైనా వస్తువులను దీపావళి సమయంలో కొనకూడదని వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లోనూ, పేజీల్లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఒక్కోసారి ఇది మితిమీరుతోంది. అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అడిగినట్లుగా ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాఠకులలో కూడా కొంత మంది ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపుల్లో ఈ లేఖను చదివి ఉంటారు.

ఏం జరుగుతోంది?
గత 20 ఏళ్లలో ఉగ్ర దాడుల్లో 90 వేల మందికి సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో చాలా వాటికి పాక్ మద్దతు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతున్నాయి. ఇండియా, చైనాల మధ్య రూ. 70 బిలియన్ల వ్యాపారం సాగుతోంది. అయితే ఇరుదేశాల మధ్య వ్యాపారం చైనాకే సానుకూలంగా ఉంది. అయితే అంతర్జాతీయ ట్రేడ్ అగ్రిమెంట్స్ కారణంగా భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. అయితే ఇలా ప్రజలు తమంతటకు తాముగా చైనా ఉత్పత్తులు వాడటం తగ్గిస్తూ పోతే ట్రేడ్ చాలా దెబ్బతింటుంది. అప్పుడు చైనా మన అంతర్గత విషయాల్లో జోక్యం చేయడం మానేస్తుందనేది చాలా మంది భావన.

ప్రముఖంగా కనిపిస్తున్న ట్యాగ్‌లు
ట్విట్టర్‌లో #BoycottChina, #BoycottChineseproducts ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి.
ఫేస్‌బుక్‌లో Stop Buying China Products, Boycoat & Ban Chines Product ఈ పేర్లతో ఇంగ్లీష్, హిందీల్లో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications