For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం,వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ బాగా త‌గ్గాయ్‌

|

వివిధ కార‌ణాల‌తో బుధ‌వారం బంగారం, వెండి ధరలు భారీగా ప‌డిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు బులియన్ మార్కెట్‌ను ఒక్కసారిగా వణికించాయి. దీంతో బుధవారం ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 730 రూపాయలు త‌గ్గిపోతే, కిలో వెండి వెల 1,750 రూపాయలు దిగజారింది. పుత్తడి ధర ఈ ఏడాదిలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొద‌టిసారిగా బంగారం ట్రేడ‌ర్లు అభివ‌ర్ణిస్తున్నారు. తాజా క్షీణతతో 10 గ్రాముల విలువ 30,520 రూపాయలకు పడిపోయింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 30,370 రూపాయలుగా ఉంది.

gold prices dropped

అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ కాలంగా వ‌డ్డీ రేట్లు పెంచేందుకు సుముఖంగా లేదు. ఆర్థిక‌ వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలుండటంతో సుధీర్ఘకాలం నుంచి వడ్డీరేట్ల పెంపు దిశ‌గా క‌ద‌ల‌ని అమెరికా కేంద్ర బ్యాంకు.. ఇక వడ్డీరేట్లను పెంచ‌వ‌చ్చ‌న్న‌ వార్తలు మార్కెట్‌ను ప్ర‌భావితం చేశాయి. పెట్టుబ‌డిదారులు డాల‌ర్ల‌ను కొనేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి డాలర్ వైపు మళ్లించగా, దేశీయంగానూ తగ్గిన డిమాండ్ ధరల పతనానికి దారితీసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు బంగారం ధర 1,300 డాలర్ల దిగువకు చేరి 1,268.40 డాలర్ల వద్ద నిలిచింది. జూన్ నుంచి గమనిస్తే ఈ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే. కిలో వెండి ధ‌ర 1750 త‌గ్గి రూ. 44,500 స్థాయికి చేరుకుంది.

Read more about: gold silver
English summary

బంగారం,వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ బాగా త‌గ్గాయ్‌ | gold prices dropped in a day is highest on wednesday

Gold prices fell by nearly 3.3 per cent in the international markets to a low of of 1,266 an ounce, on reports of tapering of bond purchases by the European Central Bank.
Story first published: Thursday, October 6, 2016, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X