ఆర్‌బీఐ ఈ రోజు రెపో రేటును 25పాయింట్లు తగ్గించి 6.25శాతంగా నిర్ణయించింది. రఘురామ్ రాజన్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవిని చేపట్టిన ఊర్జిత్ మొదటి పాలసీ సమీక్షలోనే రేట్ల కోతకు మొగ్గుచూపారు. అయితే సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)లో ఎటువంటి మార్పు లేదు. సీఆర్ఆర్ 4%గా ఉంది. దీని ప్రభావంతో మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. రూపాయి 12 పైసలు బలపడి 66.47 వద్ద కొనసాగుతోంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుకు మొగ్గుచూపడంతో బ్యాంకులు వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించే అవకాశం ఉంది. మరో వైపు రివర్స్ రెపో రేటు 6.00 నుంచి 5.75శాతానికి తగ్గింది.
ఈ ద్వైమాసిక సమీక్షలో మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ కీలక వడ్డీ రేట్లను తగ్గించేందుకు నిర్ణయించింది. ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్ల కోతకు ఆమోదం తెలిపారు. కాగా ఆర్ బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు కూడా ఇది మొదటి పరపతి విధాన సమీక్ష కానుండటం విశేషం. ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాతో పాటు కమిటీలో ఆర్‌బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరుగురు వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications