స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం కింద రూ. 65,250 కోట్లు
2016లో కేంద్రం ప్రకటించిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద రూ.65,250 కోట్ల విలువైన నల్లధనం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం ఏర్పాటుచేసి నల్లధన వివరాలను ప్రకటించారు. గత రెండేళ్ల పాలనలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుందని జైట్లీ వివరించారు.

మొత్తం 64,275 మంది నుంచి రూ.65,250 కోట్లు సేకరించినట్టు వెల్లడించారు. రూ.8,000 కోట్లను హెచ్ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఆదాయ పన్ను లెక్కల్లో చూపకుండా పోగేసిన అక్రమాస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదాయపు వెల్లడి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను వెల్లడించి చట్టపరమైన చర్యల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఈ పథకం కింద కూడా లెక్కల్లో ఆస్తులను చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ చాలా మంది నల్ల కుబేరులు వివరాలను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరందరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications