దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రం వేలం ప్రారంభమైంది. ప్రముఖ టెలికాం ఆపరేటర్లన్నీ బిడ్డింగ్ ప్రారంభించాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 5.63 లక్షల కోట్ల ఆదాయం సంక్రమించనుందని అంచనా. ఈ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా సెల్యూలార్, భారతి ఎయిర్టెల్, టాటా టెలి సర్వీసెస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అర్హత సాధించాయి. ఈ రోజు వేలం 10 గంటలకు ప్రారంభమైంది. రేపటి నుంచి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ వేలం జరుగుతుంది. 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగామెర్జ్జ్ బ్యాండ్లలో ఫ్రీక్వెన్సీని విక్రయించనున్నారు. మొత్తం 2354 మెగాహెర్జ్జ్ వేలానికి సిద్దంగా ఉంది. ఈ రేడియో తరంగాలను(ఫ్రీక్వెన్సీని) 2జీ, 3జీ, 4జీ మొబైల్ సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఏ రోజుకారోజు బిడ్డింగ్ ఫలితాలను టెలికాం శాఖ ప్రకటిస్తుంది.

ఐడియా ఇప్పటికే 10 టెలికాం సర్కిల్స్‌లో 4జీ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. వోడాఫోన్ 9 సర్కిల్స్‌లో 4జీ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. వోడాఫోన్ నూతన స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం రూ. 47 వేల కోట్లను సిద్దంగా ఉంచింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్స్‌లో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు జియోకు మాత్రమే అర్హత ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications