ఒక పక్క సింధు నది ఒప్పందంపై పాకిస్థాన్‌తో తాడోపేడీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైన వేళ చైనా పక్కలో బల్లెంలా తయారైంది. బ్రహ్మపుత్ర ఉపనదుల్లో ఒకదాన్ని చైనా బ్లాక్ చేసింది. దానిపైన ఒక ఖరీదైన జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టడంలో భాగంగా ఆ దేశం ఇలా చేస్తోంది. దీంతో దిగువభాగాన ఉన్న దేశాల్లో ఒకటైన మనకు నీళ్లు రావడం కష్టమవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే పడనుంది. చైనాలో క్షియాజిగా పిలవబడే ఈ నది సిక్కింలోకి ప్రవహించగానే షిగస్తెగా మారుతోంది. అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్రలోకి ప్రవాహం వెళుతుంది.

టిబెట్‌లో బ్రహ్మపుత్ర ఉపనది అయిన షిబుకు( Xiabuqu) ఉపనదిపై 740 మిలియన్ డాలర్లతో లాల్హో పేరుతో చైనా ఈ ప్రాజెక్టును నిర్మించతలపెట్టింది. ప్రాజెక్టు అడ్మిస్ట్రేషన్ బ్యూరో అధిపతి చైనా దేశ అధికార న్యూస్ ఏజెన్సీతో ఈ విషయాన్ని వెల్లడించారు.2014లో నిర్మాణం ప్రారంభమైన ఈ బృహత్తర ప్రాజెక్టు 2019తో పూర్తికానుంది. చైనా చేసే ఈ పనుల వల్ల కిందనున్న భారత్, బంగ్లాదేశ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
చైనా 12వ ఆర్థిక ప్రణాళికలో భాగంగా 3 అతిపెద్ద హైడ్రోప్రాజెక్టులను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించాలనుకుంటున్నారు. సాధారణంగా నీటి పంపకాలపై దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేనందున 2013లో అక్టోబర్‌లో నిపుణుల కమిటీని(ఎక్స్‌పర్ట్ లెవల్ మెకానిజం) ఏర్పరుచుకున్నారు. ఇది రెండు దేశాల మధ్య నదుల నీటి పంపకం గురించి జరిగింది. అయితే చైనా వాదన మరోలా ఉంది. భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాము ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెబుతోంది. తాము నీటిని ఒడిసిపట్టేందుకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం లేదని వివరణ ఇస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications