భారతీయులకు మంచి పెట్టుబడి మార్గం అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్లే. అయితే చాలా మంది వీటి వడ్డీపై ఉండే టీడీఎస్, ట్యాక్స్ కాంప్లికేషన్స్ వంటివి తెలుసుకోకుండా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల గురించి ఆసక్తికరమయిన ఐదు విషయాలను తెలుసుకుందాం.

1. వడ్డీ 10 వేల లోపు ఉంటే
ఎఫ్‌డీపై ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీ రూ. 10 వేల లోపు ఉంటే ఎటువంటి పన్ను కట్టక్కర్లేదు. ఒకవేళ వడ్డీ రూ. 10 వేలు దాటితే టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది. ఒకవేళ మీరు పాన్ నంబరు ఇచ్చి ఉండకపోతే టీడీఎస్ 20% కట్ అవుతుంది. ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్లకు సైతం ఈ నియమం అమలవుతోంది.

2. అన్ని డిపాజిట్లను కలిపి
ఇంతకుముందు ఒక బ్రాంచీలో ఉండే వాటికే టీడీఎస్‌ను లెక్కించేవారు. ఇప్పుడు అన్ని బ్రాంచీల్లో ఉండే డిపాజిట్లన్నింటినీ కలిపి టీడీఎస్‌ను లెక్కిస్తున్నారు. అంటే రికరింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లన్నీ కలిపి వచ్చే వడ్డీ రూ. 10 వేలు దాటితే టీడీఎస్ మినహాయిస్తారు.

3. ట్యాక్స్ రిటర్నుల్లో డిక్లేర్ చేయాలి
బ్యాంకు టీడీఎస్‌ను లెక్కించి మినహాయించినప్పటికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఆ వివరాలను పొందుపరచాలి. ట్యాక్స్ శ్లాబ్‌ను అనుసరించి వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు సాధారణంగా 10% టీడీఎస్‌ను కట్ చేస్తాయి. ఒకవేళ మీరు అధిక పన్ను(20%, 30%) బ్రాకెట్‌లో ఉంటే మిగిలిన అదనపు పన్ను ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు కట్టాలి.

4. ఫారం 15జీ లేదా 15హెచ్
పన్ను సంక్రమించే ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నప్పుడు 15జీ లేదా 15 హెచ్ ఫారాలను సమర్పించడం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మీద టీడీఎస్ మినహాయించకుండా చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఆయా ఫారంలు సబ్‌మిట్ చేయడం మరిచిపోతే పన్ను రిటర్నులు సమర్పించేటప్పుడు ఇవ్వడం ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

5. పొదుపు ఖాతా వడ్డీ
పొదుపు ఖాతాలో ఉండే నిల్వపై సంక్రమించే వడ్డీపై టీడీఎస్ మినహాయించరు. ఒకవేళ వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ. 10 వేలను మించితే దానిపై పన్ను కట్టి ఆ విషయాన్ని పన్ను రిటర్నుల్లో చూపాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications