సుబ్రతా రాయ్ బెయిల్ రద్దు: మళ్లీ జైలుకి
సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కి శుక్రవారం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన పెరోల్(తాత్కాలిక బెయిల్) ను రద్దు చేసింది. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన సుబ్రతా తాత్కాలిక బెయిల్ ను పొడిగించడానికి ఉన్నత న్యాయస్థానం ఆయన్ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. అక్టోబర్ మూడు వరకు జ్యడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. సహారా చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు మరో ఇద్దరి పెరోల్ కూడా రద్దు చేసిన సుప్రీం వారిని తిరిగి జైలుకి పంపాలని స్పష్టం చేసింది.

కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. అయితే తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6 న నాలుగు వారాల పెరోల్‌ను అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతు తో ఆగస్టు 3 న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత ఈ రోజు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications