భారతదేశంలో టాప్ టెన్ కుబేరులు వీళ్లే..

ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాలో భార‌త‌దేశంలోనే ముకేశ్ అంబానీ అగ్ర‌స్థానంలో నిలిచారు. 22.7 బిలియ‌న్ డాల‌ర్ల(1.52 ల‌క్ష‌ల కోట్ల) సంప‌ద‌తో ముకేశ్ మొద‌టి స్థానంలోఉండ‌గా, ఫార్మా దిగ్గ‌జం దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో ఉన్నారు. 100 మంది భార‌తీయ ధ‌న‌వంతుల జాబితాను ఏటా ఫోర్బ్స్ ప్ర‌క‌టిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఆస్తి విలువ‌ను లెక్కించేట‌ప్పుడు షేర్‌హోల్టింగ్ విలువ‌, ఇత‌ర ఆర్థిక వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. జాబితాలో ఉన్న మొద‌టి 10 మంది వివ‌రాలు ఇవే.

1. ముకేశ్‌ అంబానీ - రూ. 1.52 లక్షల కోట్లు

1. ముకేశ్‌ అంబానీ - రూ. 1.52 లక్షల కోట్లు

ముకేశ్ అంబానీ రిలయ‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌(ఆర్‌.ఐ.ఎల్‌)కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒక‌టిగా నిలిచిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ భార‌త‌దేశంలోనే రెండో అత్యంత విలువైన సంస్థ‌గా పేరుగ‌డించింది. రిల‌య‌న్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్ప‌త్తుల‌ శుద్ధి, పెట్రో ర‌సాయ‌నాలు, చ‌మురు, స‌హ‌జ‌వాయువు ఉత్ప‌త్తి రంగాల్లో ప‌నిచేస్తుంది. వ‌రుస‌గా 9 సంవ‌త్స‌రాలుగా దేశంలోనే అత్యంత సంపన్న వ్య‌క్తిగా ముకేశ్ అంబానీ కొన‌సాగుతూ వ‌స్తున్నారు. 2010లో హార్వ‌ర్డ్ బిజినెస్ రివ్యూలో ప్ర‌పంచంలోనే ఉత్త‌మ సీఈవోల్లో 5వ స్థానంలో నిలిచారు.

2. దిలీప్ సంఘ్వీ - రూ. 1.13 లక్షల కోట్లు

2. దిలీప్ సంఘ్వీ - రూ. 1.13 లక్షల కోట్లు

గుజ‌రాత్‌లోని అమ్రెలీలో దిలీప్ సంఘ్వీ జ‌న్మించారు. యూనివ‌ర్సిటీ ఆప్ క‌ల‌క‌త్తా నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప‌ట్టాను పొందారు. హోల్‌సేల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో తండ్రికి సాయం చేస్తూ కెరీర్‌ను ప్రారంభించారు. అలా డ్ర‌గ్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా కోల్‌క‌తాలో ప‌నిచేసేట‌ప్పుడు సొంతంగా డ్ర‌గ్స్ త‌యారుచేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. 1982లో రూ. 10 వేల మూల‌ధ‌నంతో ప్ర‌దీప్ ఘోష్ అనే భాగ‌స్వామితో డ్ర‌గ్స్ త‌యారీ కంపెనీ స‌న్ ఫార్మాస్యుటిక‌ల్ ఇండ‌స్ట్రీస్‌ను ప్రారంభించారు. 1997లో కర‌కో(caraco) ఫార్మాను స్వాధీనం చేసుకున్నారు. 2014లో ర్యాన్‌బ్యాక్సీని స‌న్ ఫార్మాలో విలీనం చేశారు. దీంతో స‌న్ ఫార్మా భార‌త‌దేశంలోనే అతిపెద్ద‌, ప్ర‌పంచంలో 5వ అతిపెద్ద డ్ర‌గ్ కంపెనీగా త‌యార‌యింది. ఈ క్ర‌మంలో స‌న్ ఫార్మాలో డైచీ రెండో అతిపెద్ద వాటాదారుగా ఉంది.

3. హిందూజా సోదరులు - రూ. 1.02 లక్షల కోట్లు

3. హిందూజా సోదరులు - రూ. 1.02 లక్షల కోట్లు

శ్రీ‌చంద్‌, గోపీచంద్‌, ప్ర‌కాష్‌, అశోక్ అనే న‌లుగురు సోద‌రులు క‌లిసి మొత్తం హిందూజా గ్రూపును న‌డిపిస్తున్నారు. 1914లో ప‌ర‌మానంద్ దీప్‌చంద్ హిందూజా ఈ గ్రూపును ప్రారంభించారు. హిందూజా గ్రూప్ కంపెనీల్లో ప్ర‌ముఖ‌మైన‌ది అశోక్ లేల్యాండ్‌. ఇత‌ర కంపెనీలు హిందూజా ఫౌండ్రీస్ లిమిటెడ్‌, ఇండ‌స్ఇండ్ బ్యాంకు, హిందూజా లేల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌, హిందూజా గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ లిమిటెడ్‌, హిదూజా వెంచ‌ర్స్ లిమిటెడ్‌, గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, హిందూజా నేష‌న‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, ఇండ‌స్ఇండ్ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్స్ లిమిటెడ్‌, అశోక్ లేల్యాండ్ విండ్ ఎన‌ర్జీ లిమిటెడ్‌, హిందూజా టెక్ లిమిటెడ్‌, హిందూజా గ్రూప్ ఇండియా లిమిటెడ్‌, హిదూజా హెల్త్‌కేర్ లిమిటెడ్ మొద‌లైన‌వి. అశోక్ లేల్యాండ్ దేశంలోనే రెండో అతిపెద్ద వాణిజ్య వాహ‌న త‌యారీదారుగా ఉంది. ఇండ‌స్ఇండ్ బ్యాంకు దేశంలోనే బ్యాంకు శాఖ‌ల‌కు ఐఎస్‌వో 9001:2000 స‌ర్టిఫికేష‌న్ క‌లిగిన వాణిజ్య సంస్థ‌గా నిలిచింది.

4. అజీం ప్రేమ్‌జీ - రూ.1 లక్ష కోట్లు

4. అజీం ప్రేమ్‌జీ - రూ.1 లక్ష కోట్లు

గుజ‌రాత్ నివాసి అయిన అజీం ప్రేమ్‌జీ ప్ర‌ముఖ ఇంజినీరు, పారిశ్రామిక‌వేత్త‌. భార‌త‌దేశంలో టాప్‌3 సాఫ్ట‌వేర్ సంస్థ‌ల్లో ఒక‌టైన విప్రోకు చైర్మ‌న్‌. ఫోర్బ్స్ క‌థ‌నం ప్ర‌కారం 1999 నుంచి 2005 వ‌ర‌కూ భార‌త‌దేశ అత్యంత ధ‌న‌వంతుడిగా కొన‌సాగారు. 2005లో ప్రేమ్‌జీని భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ భూష‌ణ్‌తో సత్క‌రించింది. 2011లో ఆయ‌న ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు. 1966లో తండ్రి మ‌ర‌ణంతో 21 ఏళ్ల వ‌య‌సులో విప్రో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేష‌న్ ద్వారా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఆయ‌న నిక‌ర ఆస్తుల విలువ 15 బిలియ‌న్ డాల‌ర్లు.

5. పల్లోంజీ మిస్త్రీ - 93వేల కోట్లు

5. పల్లోంజీ మిస్త్రీ - 93వేల కోట్లు

షాపూర్జీ ప‌ల్లోంజీ గ్రూప్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌ల్లోంజీ మిస్త్రీ ఇరాన్ నుంచి వ‌చ్చి దేశంలో స్థిర‌ప‌డిన పార్శీ కుటుంబంలో జ‌న్మించారు. 1930ల్లో ఆయ‌న తండ్రి టాటా గ్రూప్‌లో కొన్ని షేర్ల‌ను కొన్నారు. వాటి విలువ ప్ర‌స్తుతం మొత్తం టాటా గ్రూప్‌లో 18 శాతానికి పైగా ఉంది. టాటా స‌న్స్‌లో అతిపెద్ద వాటా దారు ఆయనే కావ‌డం విశేషం. దేశంలోనే నిర్మాణ సంస్థ‌ల్లో షాపూర్జీ గ్రూప్ పేరెన్నిక‌గ‌న్న‌ది.షాపూర్జీ ప‌ల్లోంజీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ లిమిటెడ్‌, ఫోర్బ్స్ టెక్స్‌టైల్స్‌, యురేకా ఫోర్బ్స్ మొదైలైన వాటికి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ‌భూష‌ణ్‌తో స‌త్క‌రించింది.

6. లక్ష్మీ మిట్టల్ - రూ. 84వేల కోట్లు

6. లక్ష్మీ మిట్టల్ - రూ. 84వేల కోట్లు

ప్ర‌పంచ ఉక్కు దిగ్గ‌జంగా పిల‌వ‌బ‌డే ల‌క్ష్మీ మిట్ట‌ల్ రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స‌దుల్పూర్ అనే గ్రామంలో పుట్టారు. క‌ల‌కత్తా న‌గ‌రంలో విద్యన‌భ్య‌సించారు. ఇంగ్లాండ్ దేశంలోని లండ‌న్‌లో స్థిర‌ప‌డ్డ ప్ర‌పంచంలోనే నాలుగో ధ‌న‌వంతుడు. ప్ర‌పంచంలో ఉక్కు ఉత్ప‌త్తిలో మొద‌టి స్థానంలో ఉన్న ఆర్సెల్లార్ మిట్ట‌ల్ కంపెనీకి చైర్మ‌న్‌, సీఈవోగా ఉన్నారు. 2008లో భార‌త ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు. ఇండియాలో టాప్ టెన్ శ్రీమంతుల్లో ఒక‌రైన ఆయ‌న ప్ర‌పంచంలో 135వ స్థానంలో ఉన్నారు. 2008లో 45 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలోనే 4వ స్థానంలో నిలిచారు.

 7. గోద్రెజ్ కుటుంబం - రూ. 83 వేల కోట్లు

7. గోద్రెజ్ కుటుంబం - రూ. 83 వేల కోట్లు

1897 సంవ‌త్స‌రంలో ముంబైలోని లాల్‌బాగ్‌లో ఆర్థెషిర్‌, ఫిరోజ్దా గోద్రెజ్‌లు గోద్రెజ్ గ్రూప్‌ను నెల‌కొల్పారు. ముంబైలో ఉన్న భాగ‌స్వామ్య సంస్థ‌ల్లో అతిపెద్ద వాటిల్లో ఇదీ ఒక‌టి. సంస్థ ప్ర‌ధాన ఉత్ప‌త్తులు లాక్‌, సోప్‌, మ‌స్కిటో రెప‌ల్లెంట్, ఫ‌ర్నిచ‌ర్‌, ఆహార ప‌దార్థాలు మొద‌లైన‌వి. రియ‌ల్ ఎస్టేట్‌లో సైతం ఈ సంస్థ‌కు చెప్పుకోద‌గ్గ వ్యాపారం ఉంది. ముంబై ఎల్బీఎస్ మార్గ్‌లోని విఖ్రోలీ రోడ్డుకు రెండు వైపులా 3500 ఎక‌రాల్లో సంస్థ చాలా ఉత్ప‌త్తుల‌ను చేప‌డుతోంది. త‌ద్వారా ముంబైలో ఇప్ప‌టివ‌ర‌కూ భారీ స్థాయిలో ప్ర‌యివేటు భాభాగాన్ని క‌లిగిన యాజమాన్యంగా పేరొందింది. గోద్రెజ్ వారి ఉద్యోగుల కోసం పాఠ‌శాల‌లు, ఆస్ప‌త్రులు, ఒక నివాస భవ‌నాన్ని నిర్మించ‌డం ద్వారా సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేరుస్తోంది. గోద్రెజ్ ఫండ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన విద్య‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, ఇత‌ర ప్ర‌జోప‌యోగ‌మైన కార్యాల‌కు నిధులు ఖ‌ర్చుపెడుతున్నారు.

8. శివనాడార్ - రూ. 76వేల కోట్లు

8. శివనాడార్ - రూ. 76వేల కోట్లు

సామాజిక వ్యాపార‌వేత్త అయిన శివ‌నాడార్ 1945లో త‌మిళ‌నాడులో తుత్కుకుడై జిల్లాలో జ‌న్మించారు. 2015 నాటికి ఆయ‌న వ్య‌క్తిగ‌త ఆస్తుల విలువ దాదాపు 13.7 బిలియ‌న్ డాల‌ర్లు. 1970-80ల్ లోశివ‌నాడార్ హెచ్‌సీఎల్‌ను స్థాపించారు. దేశ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ భూష‌ణ్‌తో స‌త్క‌రించింది. తండ్రి పేరుతో చెన్నైలో ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీని నెల‌కొల్పారు.

9. కుమార మంగ‌ళం బిర్లా - రూ. 59వేల కోట్లు

9. కుమార మంగ‌ళం బిర్లా - రూ. 59వేల కోట్లు

కుమార మంగ‌ళం బిర్లా రాజ‌స్థాన్ రాష్ట్రంలో మార్వాడీ వ్యాపారుల కుటుంబంలో జ‌న్మించారు. చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన ఆయ‌న లండ‌న్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో ఈయ‌న నాలుగో త‌రం వ్య‌క్తి. ప్ర‌స్తుతం ఆ గ్రూప్‌న‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్సెస్‌(బిట్స్‌)కు చాన్సిల‌ర్‌గా సైతం ఉన్నారు. ఆయ‌న అందుకున్న అవార్డుల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వ‌ర్టైజింగ్ అసోసియేష‌న్ నుంచి సీఈవో ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ 2014 అందించిన గ్లోబ‌ల్ లీడ‌ర్‌షిప్ అవార్డు, ఫోర్బ్స్ 2012లో అందించిన ఎంట‌ర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు మ‌చ్చుకు కొన్ని.

10. సైరస్ పూనావాలా - రూ. 57వేల కోట్

10. సైరస్ పూనావాలా - రూ. 57వేల కోట్

పూనా వాలా గ్రూప్‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సైర‌స్ పుణెలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌. సైర‌స్ పూనావాలా 1966 నుంచి వ్యాపార రంగంలో ఉన్నారు. పుణె కేంద్రంగా ఉన్న సెర‌మ్ ఇనిస్టిట్యూట్‌కు నాయక‌త్వం వ‌హిస్తున్నారు. పాము కాటుకు విరుగుడు మందును త‌యారుచేసే ఈ సంస్థ 50 ఏళ్ల నుంచి లాభాల‌ను గ‌డిస్తోంది. ఈ ఏడాది ఒక భారీ భ‌వంతి కొనుగోలు వ్య‌వ‌హారంతో ఆయ‌న పేరు దేశ‌వ్య‌ప్తంగా చ‌ర్చ‌నీయ‌మైంది. ఆ భవ‌నం ద‌క్షిణ ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఏరియాలో ఉంది. దాన్ని సొంతం చేసుకునేందుకు రూ.750 కోట్లు వెచ్చిస్తున్న‌ట్లు స‌మాచారం. 2016 జులై నెల‌లో ఫోర్బ్స్ ర్యాంకింగ్‌లో దేశంలోనే 6వ స్థానంలో నిలిచిన సైర‌స్ పూనావాలా ప్రస్తుతం ప‌దో స్థానంలో కొన‌సాగుతున్నారు. 2005 సంవ‌త్స‌రంలో భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+