సెన్సెక్స్ లాభాల్లో, నిఫ్టీ 1 శాతానికి పైగా
ఫెడరల్ బ్యాంకు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు నేడు జోరుగా కదిలాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు అమెరికా ఫెడ్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 8,800 మార్కును దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 28,773 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 8,867 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.74 వద్ద కొనసాగుతోంది.
ఐటీ, టెక్నాలజీ రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. చమురు,సహజ వాయు సూచీ 1.51%; బ‌్యాంకింగ్ 1.49%; ఆటో రంగం 1.44%; పీఎస్‌యూ సూచీ 1.37% లాభపడ్డాయి. మరో వైపు ఐటీ సూచీ 0.36%, టెక్నాలజీ రంగం 0.12% నష్టపోయాయి.

సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ(2.39%), హీరో మోటోకార్ప్(2.27%), ఐసీఐసీఐ బ్యాంకు(2.19%), అదానీ పోర్ట్స్(2.06%), ఏసియన్ పెయింట్స్(1.97%) లాభపడ్డాయి. టీసీఎస్, లుపిన్, యాక్సిస్‌బ్యాంకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
ఎన్‌ఎస్‌ఈలో అరబిందో ఫార్మా, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడగా.. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, టీసీఎస్, కోల్‌ఇండియా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications