వోడాఫోన్ ఫ్లెక్స్ : ప‌్రీపెయిడ్ వాళ్ల‌కు

వొడాఫోన్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ పథకం 'ఫ్లెక్స్‌'ను ప్రకటించింది. ఈ పథకం కింద వాయిస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌, రోమింగ్‌ అవసరాల కోసం ఒక్క రీఛార్జ్‌ చేసుకుంటే చాలు. ప్ర‌స్తుత‌లం డేటాకో ప్యాక్‌, రోమింగ్‌కో ప్యాక్‌ల కోసం డ‌బ్బు ఖ‌ర్చుపెడుతూ ఇలా వినియోగదారులు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని , కొత్త పథకంతో ఒక రీఛార్జ్‌ చేసుకుంటే చాలని వొడాఫోన్‌ తెలిపింది.

వోడాఫోన్ ఫ్లెక్స్ : ప‌్రీపెయిడ్ వాళ్ల‌కు

క‌స్ట‌మ‌ర్ చేసుకునే రీచార్జ్‌ ద్వారా అందుకు సరిపడా ఫ్లెక్స్‌ యూనిట్లు ఖాతాలో జమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఉదాహరణకు దిల్లీలో.. రూ.118తో రీఛార్జ్‌ చేసుకుంటే వినియోగదారుడుకు 325 ఫ్లెక్స్‌ యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను ఖాతాదారుడు ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌, రోమింగ్‌, ఎస్‌టీడీ కాల్స్‌కు వినియోగించుకోవచ్చు. 1 ఎంబీ 4జీ/3జీ/2జీ డేటా వినియోగం లేదా ఒక ఎస్‌ఎంఎస్‌, రోమింగ్‌లో ఒక నిమిషం ఇన్‌కమింగ్‌ కాల్‌కు వినియోగదారుడుకి ఒక ఫ్లెక్స్‌ యూనిట్‌ ఛార్జీ పడుతుంది. 1 నిమిషం లోకల్‌ కాల్‌, ఎస్‌టీడీ కాల్‌, రోమింగ్‌లో ఒక నిమిషం కాల్‌ చేసుకోవడానికి మాత్రం రెండు ఫ్లెక్స్‌ యూనిట్లు అవసరమవుతాయని కంపెనీ తెలిపింది. ఉపయోగించని యూనిట్లు తర్వాతి నెలకు బదిలీ అవుతాయని చెప్పింది. రీఛార్జ్‌ మొత్తాల శ్రేణి రూ.118-395 మధ్య ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+