దుకాణాలు మూస్తున్న నైక్
దేశంలో క్రీడా ఉత్పత్తులకు తగిన డిమాండు లేని నేపథ్యంలో అమెరికా సంస్థ నైక్ దేశంలో భారీ ఎత్తున తన దుకాణాలను మూసివేయాలని నిర్ణయించిందట. ఇటీవలి భారీ నష్టాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ మేకర్ అమెరికాకు చెందిన నైక్ దాదాపు 35శాతం స్టోర్లను తొలగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

భాగస్వాముల సంఖ్యను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. గతంలో 20 మంది ఉన్న భాగస్వాముల సంఖ్యను రెండు నుంచి మూడుకు తగ్గించే యోచనలో ఉందని తెలిపారు. పెట్టుబడులపై క్షీణించిన ఆదాయం, తప్పుడు మార్కెటింగ్ విధానాలే సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయని, రీటైల్ వ్యాపార విస్తరణ ప్రణాళిక కూడా విఫలమైన కారణంగా దుకాణాల మూసివేతకు దారితీసిందని మరో పరిశ్రమ పెద్ద అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్ పై సంవత్సరానికి దాదాపు 60 కోట్లకు పైగా వెచ్చించే నైక్...భారత క్రీకెట్ దిగ్గజాలకు కిట్ల స్పాన్సరింగ్ విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్టు సమాచారం.
కాగా నైక్ ప్రస్తుతం సుమారు 200 దుకాణాలను నిర్వహిస్తున్న నైక్ అడిడాస్ , రీ బ్యాక్, ప్యూమా లాంటి ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా ప్రీమియం షూస్, దుస్తులు తదితర అమ్మకాల్లో పేరు గడించింది.
ఆర్వోసీ వద్ద ఉన్న వివరాల మేరకు 2014-15 సంవత్సరంలో నైక్ రూ.541 కోట్ల మేర నష్టాలను గడించింది. మరో వైపు అడిడాస్ నష్టాలు రూ. 101 కోట్లు, రీబోక్ నష్టాలు రూ. 2198 కోట్లుగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జర్మనీ స్పోర్ట్స్‌వేర్ సంస్థ పూమా రూ. 47 కోట్ల లాభాలను గడించింది.


Click it and Unblock the Notifications