గురువారం వరకూ రైల్వే ప్రవేశపెట్టిన ప్రయాణ బీమాకు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు తెలిపారు. 92 పైసలకే రెల్వే రూ. 10 లక్షల బీమాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 1 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఇందులో 50,03,834 చేరారు.
పథకమిదీ:
రెలు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు అదనంగా 92 పైసలు చెల్లించడం ద్వారా బీమాను ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణికుడి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే వారికి లేదా వారి నామినీలకు లేదా వారసులకు రూ. 10 లక్షల ప్రయోజనాన్ని చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి రూ. 7.5 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ. 2 లక్షల వరకూ, రవాణా ఖర్చుల కింద రూ. 10 వేలను అందిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలకు, విదేశీ పౌరులకు కవరేజీ వర్తించదు.