నల్లధనం వెలికి తీయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) ద్వారా డిక్లరేషన్లు ఇచ్చేందుకు ఉన్న గడువు ఈ నెల 30 నాటికి ముగియనున్న నేపథ్యంలో కేంద్రం దానికి సంబంధించి అన్ని చర్యలను పకడ్బందీగా చేస్తోంది.

దేశంలోని అన్ని కార్యాలయాలను 30వ తేదీ అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆదాయం పన్ను విభాగాన్ని ఆదేశించింది. '2016 ఐడిఎస్ కింద డిక్లరేషన్లు చేయడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు. అందువల్ల ఆ రోజు అర్ధరాత్రి దాకా కూడా డిక్లరేషన్లు దాఖలు చేయవచ్చు. కార్యాలయం పని గంటల తర్వాత కూడా డిక్లరేషన్లు దాఖలు చేయడానికి వీలుగా ఈ పథకం కింద డిక్లరేషన్లు అందుకోవడం కోసం సెప్టెంబర్ 30వ తేదీన అన్ని జ్యురిస్డిక్షన్లలోను కార్యాలయాలను అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచేలా చూడాలని ముఖ్య చీఫ్ కమిషనర్లను కోరడమైంది' అని సిబిడిటి గురువారం ఒక ఉత్తర్వులో పేర్కొంది. దీనికి సంబంధించి సిబిడిటి చీఫ్ రాం సింగ్ ఈ నెల 17న దేశంలోని అన్ని ప్రాంతీయ ఐటి రీజినల్ కమిషనర్లతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కాగా, ఐడిఎస్ పథకం కింద ఈ నెల 30వరకు ఐటి శాఖకు అందే సమాచారం, డిక్లరేషన్లు అన్నిటినీ రహస్యంగా ఉంచడం జరుగుతుందని ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం చేసింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications