444 పాయింట్ల నష్టంలో మార్కెట్లు
అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే మదుపర్లకు షాకిచ్చిన మార్కెట్లు మిడ్ సెషన్లో కొద్దిగా కోలుకున్నా చివరికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ఒక దశలో 550 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత స్వల్పంగా కోలుకుంది. మార్కెట్ ముగిసే సరికి 443.71 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28,353 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 8,715, వద్ద క్లోజ్ అయ్యాయి. బ్రెగ్జిట్ సంక్షోభం తర్వాత ఇదే భారీ పతనమని మార్కెట్ల వర్గాలు అంటున్నాయి.

ఈ రోజు అన్ని రంగాల సూచీలు నష్టాల బాట పడ్డాయి. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో బ్యాంక్ సెక్టార్ భారీగా పతనం కాగా, ఐటీ సెక్టార్ లాభాలను ఆర్జించింది.. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా ఇదే బాట పట్టాయి. హిందాల్కో బీవోబీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా పవర్, ఏసీసీ, స్టేట్‌బ్యాంక్, భెల్ నష్టపోగా, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఆర్‌ఐఎల్, టీసీఎస్ లాభపడ్డాయి. అమెరికా మందగమనం, బ్రెక్సిట్ వంటి అంశాల కారణంగా ఇటీవల నీరసించిన ఐటీ రంగంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, విప్రో, టీసీఎస్, రిలయన్స్ తదితర షేర్లు లాభపడగా.. హిందాల్కో, ఎస్‌బ్యాంక్, టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబుజా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications