వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే జీఎస్టీ అమలుకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రయత్నంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. దేశంలో పరోక్ష పన్ను విధానంలో కీలక సంస్కరణగా, సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లుకు సంబంధించి ఏర్పాటు చేసే జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లుకు గత వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. సోమవారం సమావేశమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ, జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా పనిచేస్తారు. ప్రధాన అటు ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ కొన్ని సూచనలు, సలహాలు అందించింది.

జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలపై ఈ కౌన్సిల్ నిర్ణయమే కీలకం. జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశం సెప్టెంబర్ 22 , 23 తేదీల్లో జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications