ఒక అధ్యయనంలో పోటీతత్వంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉందని వెల్లడైంది. సింగపూర్‌కు చెందిన లీ కుయన్ యె స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నేతృత్వంలో ఆసియా కాంపిటీటివ్‌నెస్ ఇనిస్టిట్యూట్(ఏసీఐ) నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు విషయాలు తెలిశాయి. కాంటిటీటివ్‌నెస్ ర్యాంకింగ్ నాలుగు అంశాల ఆధారంగా జరిగింది. స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, ప్రభుత్వం, సంస్థల ఏర్పాటు, ఆర్థిక, వ్యాపార, మానవ వనరులు ఎలా ఉన్నాయి, మౌలిక వనరుల అభివృద్ది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

అధ్యయనం ప్రకారం మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు ఉండగా దాని తర్వాత గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ స్థానం 7.
చైనా, ఉప ఆర్థిక వ్యవస్థలు, భారత్‌లో ఐదు ప్రాంతాల్లో ఏసీఐ ర్యాంకింగ్‌లను ప్రకటిస్తుంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన లీ కుయన్ యె స్కూల్ ఆప్ పబ్లిక్ పాలసీకి చెందిన పరిశోధనా విభాగాల్లో ఏసీఐ ఒకటి. సర్వేకు ఉపయోగించిన సమాచారం 2013-14కు చెందినది.మొత్తం 4 అంశాల వారీగా జరిగిన అధ్యయనంలో 11 ఉప పరిస్థితులు, 75 సూచికలను పరిగణించడం జరిగిందని ఏసీఐ అసోసియేట్ ప్రొఫసర్ తాన్ కీ గియాప్ చెప్పారు.


Click it and Unblock the Notifications