మంగళవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఒక దశలో 29 వేల స్థాయిని దాటేసింది. నిప్టీ సైతం 18 నెలల గరిష్టానికి వెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 28,978 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు పైకి ఎగసి 8943 పాయింట్ల వద్ద క్లోజయింది. ఒక పక్క ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచాలనుకుంటున్న తరుణంలో యూఎస్ పేరొల్స్ డేటా నిరాశపరచడం భారత మార్కెట్ల సెంటిమెంటుకు సానుకూలాంశమయింది. దీంతో పాటు ఫెడ్ రేట్లపై సీఎంఈ గ్రూప్ నిర్వహించిన ఫెడ్ వాచ్ గ్రూప్ ఫెడ్ రేట్ల పెంపు 24%కాకుండా 21 శాతంగా ఉండగలదని గురువాం రోజు చెప్పిన వార్తతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి.

బీఎస్ఈలో అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.96% లాభపడగా, వినియోగదారు వస్తువుల(కన్సూమర్ డ్యూరబుల్స్) సూచీ 2.94%, ఆటో రంగం 2.83%, విద్యుత్ (పవర్) రంగం 1.39% పైకి ఎగిశాయి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన వాటిలో టాటామోటార్స్(7.19%), యాక్సిస్ బ్యాంకు(6.14%), ఐసీఐసీఐ బ్యాంకు(4.25%), టాటా స్టీల్(3.25%) ఉన్నాయి. నష్టపోయిన వాటిలో టీసీఎస్(1.17%), కోల్ ఇండియా(1.11%), విప్రో(0.11%), ఐటీసీ(0.04%) ఉన్నాయి.
డాలరుతో రూపాయి విలువ 66.52గా కొనసాగుతోంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications