ఆదాయ అసమానతల్లో భారత్ స్థానం రెండా?
గత రెండు, మూడు రోజులుగా ప్రధాన పత్రికలన్నీ ఆదాయ అసమానతల్లో భారత్ రెండో స్థానంలో ఉండటాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ రిపోర్టు ప్రకారం సంపద పంపిణీలో రష్యా తర్వాత అత్యధిక అసమానతలు కలిగిన దేశంగా మన దేశం ఉన్నట్లు నివేదిక తెలియచెబుతోంది. సామ్యవాదంతో ప్రపంచానికి సమానత్వాన్ని చాటిన రష్యా సంపద అసమానతల్లో మొదటి స్థానంలో ఉండటం విస్మయం కలిగిస్తుండగా అసలు ఈ అసమాతలేంటి, ఏయే దేశాల్లో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మిలినీయర్ల వద్ద 54% సంపద
ఎక్కువగా న్యూస్ ఏజెన్సీలు ప్రచురించిన ఈ వార్త సంపద అధ్యయన సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ విశ్లేషణాత్మక కథనం ఆధారంగా ఉంది. ఆయా దేశాల్లో ప్రముఖ మిలియనీర్లంతా కలిసి ఎంత శాతం సంపద కలిగి ఉన్నారనేది ఇక్కడ ప్రస్తావించారు. మిలియనీర్ల కంతా మన దేశంలో 54% సంపద కలిగి ఉన్నారని న్యూ వరల్డ్ వెల్త్ విశ్లేషించింది.

వాస్తవ స్థానం 12: ఆండ్రూ అమాయిల్స్
"అసమానతలు కలిగిన దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉన్నప్పటికీ న్యూ వరల్డ్ వెల్త్ నివేదికలో రెండో స్థానంలో ఉంచారు. మిలియనీర్లు 54% సంపద కలిగి ఉన్నారని రిపోర్టు చేసినప్పటికీ వాస్తవానికి అది అంతకంటే తొమ్మిది శాతం తక్కువగా 45% ఉంది." అని పరిశోధనా వేత్త ఆండ్ర్యూ అమాయిల్స్ అన్నారు.

రష్యా అగ్రస్థానంలో
రష్యాలో 62 శాతం సంపద కుబేరుల వద్ద పోగుపడి ఉండగా, మన దేశంలో 54% మిలినీయర్ల వద్దే ఉందని నివేదిక పేర్కొంది. ధనవంతుల దగ్గర ఉండే సంపద నిష్పత్తిని బట్టి దీనిని అంచనా వేసినట్లు న్యూవరల్డ్ వెల్త్ తెలిపింది.

అమెరికాలో 32%; యూకేలో 35%
అమెరికా దేశంలో 32 శాతం సంపద సంపన్నుల గుప్పిట్లో మూలుగుతోంది. యూకేలో మరికొంత ఎక్కువగా 35శాతం సంపద ధనవంతుల దగ్గర పోగుపడింది.
సంపద సమానత విషయంలో జపాన్ ముందు వరుసలో నిలిచింది. అక్కడ మొత్తం సంపదలో 22% మాత్రమే సంపన్నుల వద్ద ఉంది. ఆస్ట్రేలియాలో సంపన్నుల వద్ద 28% సంపద ఉంది.

సంపద సమానతలో జపాన్ నయమే
బిలియనీర్ల పరంగా చూస్తే.. రష్యాలో 26% సంపద, జపాన్‌లో 3% సంపద బిలియనీర్ల వద్ద ఉంటోంది. జపాన్‌లో మిలినీయర్ల వద్ద కేవల0 22% సంపద మాత్రమే ఉంది.

మిలినీయర్ల చేతిలో ఏ దేశం సంపద ఎలా?
రష్యా (62%)
2. సౌదీ అరేబియా (58%)
3. నైజీరియా(56%)
4. బ్రెజిల్ (55%)
5. భారత దేశం(45%)
6. బ్రిటన్ (35%)
7. యూఎస్ఏ(32%)
8. జపాన్ (22%)
* ప్రపంచ సగటు- 35%

1 శాతం చేతిలో 49% సంపద
దేశంలో కింది స్థాయి 30 శాతం మంది వద్ద 1.4% మాత్రమే సంపద ఉండగా; 10 శాతం మంది కుబేరుల వద్ద 74% సంపద ఉంది. దాని తర్వాత ఎగువ మధ్య స్థాయి 30% వద్ద 5.7% సంపద ఉంది. 1 శాతం మనుషుల వద్దే 49% సంపద పోగుపడగా, అదే 5 శాతం మంది ధనవంతుల వద్ద 65.5 శాతంగా ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications