దేశంలో టాప్ 20 బ్రాండ్లు

మ‌న నిత్య జీవితంలో ఎన్నో వ‌స్తువుల‌ను కొంటూ ఉంటాం. ఫ్యాష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, పాద‌ర‌క్ష‌లు వంటి వాటిని తీసుకునేట‌ప్పుడు ఇప్పుడు అంద‌రూ ఆలోచించే విష‌యం బ్రాండ్‌. ఇంత‌గా మ‌న జీవితంలో పెన‌వేసుకుపోయిన వ‌స్తువుల విష‌యంలో మంచి కంపెనీలేంట‌నే ఆస‌క్తి అంద‌రికీ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎక‌న‌మిక్ టైమ్స్ త‌యారుచేసిన‌ దేశంలో టాప్ 20 బ్రాండ్ల జాబితాను చ‌ద‌వండి.

1. టాటా గ్రూప్‌

1. టాటా గ్రూప్‌

బ్రాండ్ విలువ‌: .రూ. 742.18 బిలియ‌న్

దేశంలో అత్యుత్త‌మ బ్రాండ్ అంటే టాటా అనేలా అప్ర‌తిహ‌తంగా దాని ప్ర‌స్థానం కొన‌సాగుతోంది. దాని బ్రాండ్ విలువ 11% పెరిగింది. దాని ప్యాసెంజ‌ర్ వాహ‌నాల విభాగం జెస్ట్ సెడాన్‌ను విడుద‌ల చేసింది. 2016లో టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అంత‌ర్జాతీయంగా పేరొందిన ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనాల్ మెస్సిని నియ‌మించుకుంది. ఇంకా టాటా మోటార్స్ సీఈవో,ఎండీగా గ్యుంట‌ర్ బ‌షెక్‌ను నియ‌మించారు. టాటా గ్రూప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ 14.8% వృద్దితో రూ. 1,08,646 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా గ్లోబ‌ల్ బేవ‌రేజెస్ టీ, కాఫీ, తాగునీరు కాకుండా డైరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా ఈ-కామ‌ర్స్‌లోకి టాటాక్లిక్ ద్వారా ప్ర‌వేశించింది.

2. ఎయిర్‌టెల్‌

2. ఎయిర్‌టెల్‌

బ్రాండ్ విలువ‌: రూ. 350.44 బిలియ‌న్‌

దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా ఓపెన్ నెట్‌వ‌ర్క్‌ను ప్రారంభించి కాల్‌డ్రాప్స్, నెట్‌వ‌ర్క్ క‌వరేజీ స‌మ‌స్య‌లు లాంటి వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎయిర్‌టెల్ ప్ర‌య‌త్నిస్తోంది. ఓపెన్ నెట్‌వ‌ర్క్ ద్వ‌రా వినియోగ‌దారుల ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటూ ఎయిర్‌టెల్ ముందుకెళుతోంది. ఇలాంటి ఎన్నో చ‌ర్య‌లు ఎయిర్‌టెల్‌ను నంబ‌రు 2 స్థానంలో ఉంచేలా చేసింది. దీని బ్రాండ్ విలువ గ‌తేడాదితో పోలిస్తే 8% పెరిగింది. ఆఫ్రికాలో మొద‌టి త్రైమాసికంలో న‌ష్టాలు స‌గానికి త‌గ్గాయి. 2015లో దేశ‌వ్యాప్తంగా 4జీ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభించింది. క్యాబ్‌రైడ్ల త‌ర్వాత చెల్లింపులు ఎయిర్‌టెల్ మ‌నీ ద్వారా చేసే విధంగా ఉబ‌ర్‌తో ఒప్పందం చేసుకుంది. బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద నెట్‌వ‌ర్క్ ఏర్పాటు చేసే క్ర‌మంలో ఆ దేశానికి చెందిన యాక్సియాటా విలీనాన్ని ప్ర‌క‌టించింది.

3. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్

3. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్

బ్రాండ్ విలువ‌: రూ. 349.24 బిలియ‌న్‌

ఇప్ప‌టికే ఎన్నో రంగాల్లో విస్త‌రించిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సొంత మొబైల్ హ్యాండెసెట్ల త‌యారీలోకి ప్ర‌వేశించింది. ప‌రిశోధ‌నా సంస్థ ఐడీసీ ప్రకారం ఎల్‌వైఎఫ్ బ్రాండ్ మొబైల్ కంపెనీల్లో ఇప్ప‌టికే (భార‌త్‌లో)టాప్‌5లో ఉంది. ఎల్‌వైఎఫ్ మొబైల్ ఫోన్ల ధ‌ర రూ. 3వేల స్థాయిలో ఉండ‌టం బాగా లాభించే అంశం. దీంతో 4జీ సేవ‌ల‌ను అందించే అంశంలో ఇది దూసుకెళ్ల‌నుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. రూ. 1ల‌క్షా యాభై వేల కోట్ల‌తో డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌ను స‌మూలంగా మార్చేందుకు తాము య‌త్నిస్తున్న‌ట్లు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌ ఛైర్మ‌న్

ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు. డిసెంబ‌రు త‌ర్వాత జియో వాణిజ్య సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

బ్రాండ్ విలువ‌: రూ. 240.06 బిలియ‌న్‌

బ్రాండ్ విలువ‌ను ఎక్కువ‌గా పెంచుకున్న వాటిలో ఇది ముందుంది. 2015తో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ 15 శాతం బ్రాండ్ విలువ‌ను పెంచుకుంది. నూత‌నంగా వ‌స్తున్న అవ‌స‌రాల్లో త‌న‌ను తాను మార్చుకుని వినియోగ‌దారుల‌ను చేరుకోవ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. జోన్ స్టార్ట‌ప్స్ ఇండియా(జేఎస్ఐ) భాగ‌స్వామ్యంతో స్టార్ట‌ప్‌ల కోసం బ్యాంకింగ్ అవ‌స‌రాల‌ను తీర్చేలా స్మార్ట‌ప్‌ను త‌యారుచేసింది. మొద‌టి ఆరు నెల‌ల‌కు జీరోబ్యాలెన్స్ వేత‌న ఖాతాతో పాటు ఫారెక్స్ సేవ‌ల‌ను స్మార్ట‌ప్ అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ గ‌తేడాది పేజ్‌యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది పేమెంట్ల‌ను సులభ‌త‌రం చేసింది. అవ్య‌వ‌స్థీకృత రంగం నుంచి తీసుకునే అప్పుల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వివ‌రించేందుకు గ్రామీణ వినియోగ‌దారుల కోసం దంచాయ‌త్ అనే ఎడ్యుకేష‌న‌ల్‌ ఫిల్మ్‌ను త‌యారుచేసింది.

5. ఎల్ఐసీ

5. ఎల్ఐసీ

బ్రాండ్ విలువ: రూ. 236.05 బిలియ‌న్‌

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మోస్ట్ ట్ర‌స్టెడ్ బ్రాండ్ల‌లో చోటు ద‌క్కించుకుంది. ప్ర‌తి ఏడాది బీమా రంగంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని సాధించుకుంటూ వ‌స్తోంది. ప్ర‌యివేటు రంగ బీమా సంస్థ‌లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న‌ప్ప‌టికీ ఎల్ఐసీ ఇప్ప‌టికీ మార్కెట్‌లో 70 శాతం వాటాను క‌లిగి ఉందంటే అది అందిస్తున్న సేవ‌లు, బీమా ఉత్ప‌త్తుల్లో అనుస‌రిస్తున్న వినూత్న విధానాలే అందుకు కార‌ణం. బీమా పాల‌సీల‌ను అమ్మేందుకు ఎన్నో బ్యాంకుల‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఎల్ఐసీ ఈ మ‌ధ్యే యాక్సిస్ బ్యాంకుతో జ‌ట్టుకట్టింది.

6. ఎస్‌బీఐ

6. ఎస్‌బీఐ

బ్రాండ్ విలువ: రూ. 232.21 బిలియ‌న్

ఆర్‌బీఐ ఇటీవ‌ల రెండు అతిపెద్ద బ్యాంకులు విఫలం అయ్యేందుకు అవ‌కాశ‌మే లేద‌ని ప్ర‌క‌టించింది. అంటే దేశీయంగా వ్య‌వ‌స్థాప‌రంగా ముఖ్య‌మైన బ్యాంకులు రెండ‌ని అర్థం. అవి రెండూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ. అంత బ‌లంగా ఎస్‌బీఐ మూలాలు ఉన్నాయి. దేశంలోనే అత్య‌ధికంగా ఏటీఎమ్ నెట్‌వ‌ర్క్‌ను క‌లిగి ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంకే. మొబైల్ వ్యాలెట్ 13 భాష‌ల్లో ఉంది. ప్రైవేటు బ్యాంకుల‌తో పోటీ ప‌డుతూ యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఉంది. ఎస్‌బీఐకి చెందిన కొన్ని యాప్‌లు స్టేట్ బ్యాంక్ ఫ్రీడ‌మ్‌, ఎస్‌బీఐ క్విక్‌, స్టేట్ బ్యాంక్ బ‌డ్డీ, స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్‌, ఎస్‌బీఐ నోక్యూ, ఎస్‌బీఐ స‌మాధాన్‌.

లీడింగ్ క్రెడిట్ కార్డు జారీదారుల్లో ఒక‌టైన ఎస్‌బీఐ కార్డ్ అమెజాన్‌, బుక్‌మైషో, ఫ్యాబ్‌ఫ‌ర్నిష్‌, లెన్స్‌కార్ట్‌, వోలా వంటి 7 అతిపెద్ద ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌తో జ‌ట్టుక‌ట్టింది. పేమెంట్ గేట్‌వేకి సంబంధించి ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించేందుకు పేపాల్‌తో భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌రుచుకుంది.

7. ఇన్ఫోసిస్

7. ఇన్ఫోసిస్

బ్రాండ్ విలువ: రూ. 230.64 బిలియ‌న్‌

దేశంలోనే సాఫ్ట్‌వేర్ రంగంలో స్టార్ట‌ప్‌లాగా వ‌చ్చి విప్ల‌వం సృష్టించిన ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్‌. ఏటికేడు బ్రాండింగ్‌లో త‌న స్థానాన్ని నిలుపుకుంటూ వ‌స్తోంది. ఈ ఏడాది దాని బ్రాండ్ విలువ 12% పెరిగింది. బ్రెగ్జిట్ త‌ద‌నంతర ప‌రిణామాల‌తో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నప్ప‌టికీ త‌న ఇన్నోవేష‌న్‌తో దేశంలో టాప్3 ఐటీ దిగ్గ‌జాల్లో కొనసాగుతోంది. ప్రాసెస్ ఓరియెంటెడ్ అప్రోచ్ కాకుండా డిజైన్ థింకింగ్‌ను సీఈవో విశాల్ సిక్కా ప్రాధాన్య‌మిస్తున్నారు. ఆటోమేష‌న్‌, ఇన్నోవేష‌న్ అంశాల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా ఆర్టిఫిష‌య‌ల్ ఇంటెలిజెన్స్‌ను స‌మ‌ర్థంగా వాడుకునేందుకు మ‌న ప్లాట్‌ఫ‌మ్‌ను లాంచ్ చేశారు. ప‌నిలో లింగ స‌మానత‌ను ప్రోత్స‌హించేందుకు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజు #sitwithme క్యాంపెయిన్‌ను లాంచ్ చేశారు.

8. ఐసీఐసీఐ

8. ఐసీఐసీఐ

బ్రాండ్ విలువ: రూ. 166.59 బిలియ‌న్

ఎస్‌బీఐ లాగే భార‌త బ్యాంకింగ్ రంగంలో విఫ‌ల‌మ‌వ‌డానికి అవ‌కాశం లేని బ్యాంకుల్లో ఒక‌టిగా ఐసీఐసీఐ నిలిచింది. మునుప‌టి త్రైమాసికంతో పోలిస్తే నిక‌ర లాభంలో 25% త‌గ్గుద‌ల ఉన్న‌ప్ప‌టికీ రిటైల్ బ్యాంకింగ్‌లో 18% వృద్దిని క‌న‌బ‌రిచింది. ద‌క్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బ‌ర్గ్‌లో శాఖ‌ను ప్రారంభించ‌డంతో అక్క‌డ సేవ‌ల‌ను ఫుల్ టైమ్ సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్ల‌యింది.

భ‌విష్య‌త్తుపై దృష్టితో మొబైల్ యాప్ డెవ‌ల‌ప్‌మెంట్ పోటీ యాపాథాన్‌ను నిర్వ‌హించింది. మీరు ఆట ఆడుతున్నా, చాటింగ్‌లో ఉన్నా, ఈమెయిల్ ఓపెన్ చేసి ఉన్నా దానిని క్లోజ్ చేయ‌కుండానే ఐమొబైల్ యాప్ ద్వ‌రా డ‌బ్బు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 'గిఫ్ట్ ఎ లైవ్‌లీహుడ్' పేరిట ఐసీఐసీఐ ఫౌండేష‌న్ రెఫ‌ర‌ల్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఎవ‌రికైనా జీవ‌న నైపుణ్యాల‌ను పెంపొందించే అవ‌సరం ఉంద‌ని భావిస్తే వారిని మీరు ఈ ఫౌండేష‌న్‌కు రెఫ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇలాంటి కార్య‌క్ర‌మాల ద్వ‌రా ఐసీఐసీఐ ఫౌండేష‌న్ స్కిల్స్ అకాడ‌మీ ఇప్ప‌టివ‌ర‌కూ 22 కేంద్రాల్లో 36 వేల మంది యువ‌త‌ను నైపుణ్యాభివృద్ది దిశ‌గా న‌డిపించింది.

9. మ‌హీంద్రా

9. మ‌హీంద్రా

బ్రాండ్ విలువ: రూ. 156.78 బిలియ‌న్‌

గ‌త సంవ‌త్స‌ర కాలంలో 14 నూత‌న ఉత్ప‌త్తుల‌ను మ‌హీంద్రా గ్రూప్ ప్ర‌వేశ‌పెట్టింది. 17.8 బిలియ‌న్ డాల‌ర్ల విలువ‌తో మ‌హీంద్రా బ్రాండ్ విలువ గ‌తేడాది క‌న్నా 14% పెరిగింది. ప్యూగోట్ మోటార్ సైకిల్ వ్యాపారంలో 51% వాటాను మ‌హీంద్రా ద‌క్కించుకుంది. యూఎస్ మార్కెట్ కోసం మ‌హీంద్రా కొత్త‌గా జెన్‌జీ అనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ఎయ‌ర్‌బ‌స్ సంస్థ‌కు సంబంధించి ఒక రూప్‌క్రాఫ్ట్ వాహకానికి విమాన విడివిభాగాల ఉత్ప‌త్తి కాంట్రాక్టును మ‌హీంద్రా గ్రూప్ ద‌క్కించుకుంది. ఎయ‌ర్‌బ‌స్ హెలికాప్ట‌ర్ల‌కు టైర్‌1 సప్ల‌యిర్ల‌లో మొద‌టి దేశీయ కంపెనీ ఇదే. మ‌హీంద్రా వాహ‌న త‌యారీ విభాగంలో 53వేల కోట్ల రెవెన్యూను చేరుకోవ‌డం ద్వారా దేశంలో రెండో అతిపెద్ద వాహ‌న త‌యారీదారుగా ఎద‌గాల‌న్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సెకండ్ హ్యాండ్‌(ప్రీ వోన్‌డ్‌) వెహిక‌ల్ మార్కెట్‌లో మ‌హీంద్రా ఫ‌స్ట్ చాయిస్ వీల్స్ రూపంలో వ్యాపారం చేస్తోంది.

10. గోద్రెజ్‌

10. గోద్రెజ్‌

బ్రాండ్ విలువ: రూ. 153.88 బిలియ‌న్‌

గ‌తేడాది కంటే ఒక స్థానం త‌గ్గిన గోద్రెజ్ 10 వ స్థానంలో నిలిచిన‌ప్ప‌టికీ 2010లో ఉన్న స్థాయి కంటే 10 రెట్లు ఎద‌గాల‌ని ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతోంది. 2020 నాటికి 10 బిలియ‌న్ డాల‌ర్ల మార్కును అందుకోవాల‌నేది కంపెనీ విజ‌న్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్ట్రెంత్ ఆఫ్ నేచ‌ర్‌ను చేజిక్కించుకుంది. హెయిర్‌కేర్‌, హోమ్ కేర్, ప‌ర్స‌న‌ల్ కేర్ వంటి మూడు ర‌కాల ఉత్ప‌త్తుల‌తో మూడు ఖండాల్లో(ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) ఉండాల‌నే ప్ర‌ణాళిక‌ను చైర్మ‌న్ ఆది గోద్రెజ్ 3 బై 3 వ్యూహంగా చెబుతారు. గోద్రెజ్ క‌న్సూమ‌ర్ ప్రొడ‌క్ట్స్ లిమిటెడ్ 200 మిలియ‌న్ డాల‌ర్ల వార్షిక రెవెన్యూను క‌లిగి ఉంది. గోద్రెజ్ ప్రాప‌ర్టీస్ ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో అత్య‌ధిక అమ్మ‌కాల‌తో 5038 కోట్ల రూపాయ‌ల బుక్ వాల్యూను క‌లిగి ఉంది.

11. విప్రో

11. విప్రో

బ్రాండ్ విలువ‌: రూ. 139.69 బిలియ‌న్‌

కొన్ని రోజుల క్రితం త‌మ ఉద్యోగుల‌కు విప్రో సీఈవో రాసిన లేఖ ఆస‌క్తిని రేకెత్తించింది. అందులో జావా వంటి సంప్ర‌దాయ కంప్యూట‌ర్ ల్యాంగ్వేజెస్ కంటే స్విఫ్ట్‌, పైథాన్ వంటి కొత్త ప్రోగ్రామింగ్ భాష‌లు తెలిసిన వారికి కొంచెం మెరుగ్గా వేత‌నాలు చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. దాంతో మార్పు వ‌చ్చింది. అంతే కాకుండా స్టార్ట‌ప్‌ల్లో పెట్టుబ‌డి పెట్టేందుకు, కొత్త సాంకేతిక‌ల‌ను మెరుగుప‌రిచేందుకు 100 మిలియ‌న్ డాల‌ర్ల కార్పొరేట్ వెంచ‌ర్ క్యాపిట‌ల్‌ను ఏర్పాటు చేశారు. బ్రాండ్ డిజిటల్, ఐటీ భాగ‌స్వామ్యాల్లో భాగంగా బార్‌క్లేస్ ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్‌, చెల్సియా ఫుట్‌బాల్ క్ల‌బ్‌ల‌తో భాగ‌స్వామ్యాల‌ను కుద‌ర్చుకున్నారు.

12. ఎల్ & టీ

12. ఎల్ & టీ

బ్రాండ్ విలువ‌: రూ. 134.89 బిలియ‌న్

ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మాణ రంగంలో దేశంలో అగ్ర‌స్థానంలో ఉంది. భార‌తదేశంలోనే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎయిర్‌పోర్టుల‌ను క‌ట్ట‌డంలోనూ, రియాద్‌, క‌తార్‌, దేశంలోనూ ప్ర‌ధాన న‌గ‌రాల మెట్రో న‌గ‌రాల్లో మెట్రో రైలు నిర్మాణాల్లో ఎల్‌&టీ కీల‌క భూమిక పోషిస్తోంది. 16 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఈ కంపెనీ టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, నిర్మాణం, ప్రాజెక్టులు, త‌యారీ, ఆర్థిక సేవ‌ల భాగ‌స్వామ్యం వంటి రంగాల్లో విస్త‌రించి ఉంది. సామాజిక బాధ్య‌త అనే ప‌దం గురించి చ‌ర్చ జ‌ర‌గ‌న‌ప్పుడే ఎంద‌రో అండ‌ర్‌ప్రివిలైజ్‌డ్ జీవితాల‌ను స‌మూలంగా మార్చేసిన చరిత్ర ఈ సంస్థది. ఎల్ అండీ టీ అధినేత ఎమ్ నాయ‌క్ 75% ఆదాయాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

13. బ‌జాజ్ ఆటో

13. బ‌జాజ్ ఆటో

బ్రాండ్ విలువ‌: రూ. 121.78 బిలియ‌న్

ప‌రిశ్ర‌మ మొత్తానికి క‌ష్ట‌మైన సంవ‌త్స‌రంలో బ‌జాజ్ త‌న వ్యాపార ప్ర‌య‌ణాన్ని స‌జావుగా సాగించింది. దేశంలో మోటార్ సైకిళ్లు, త్రిచ‌క్ర వాహనాల్లో అతిపెద్ద ఎగుమ‌తిదారుగా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది. 2012లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌జాజ్ క్యూట్ ఫ్యూయెల్ ఎఫిసియెంట్‌, వాహ‌న ఉద్గారాల్లోనూ ఉత్త‌మంగా నిలిచింది. క్యూట్ బ్రాండ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 13 మార్కెట్ల‌కు ఎగుమ‌తి అయింది. కొన్ని కోర్టు కేసుల కార‌ణంగా మ‌న దేశంలో ఇంకా విడుద‌ల కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో త‌యార‌యిన కార్ల‌లో అత్యంత త‌క్కువ‌గా కాలుష్య ఉద్గారాల‌ను విడుద‌ల చేసే కార్ ఇదే అని అంటున్నారు.

14. మారుతి సుజుకి

14. మారుతి సుజుకి

బ్రాండ్ విలువ‌: రూ. 115.63 బిలియ‌న్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో చాలా కాలం నుంచి ఉన్న మ‌రో సంస్థ మారుతి సుజుకి. దేశంలో కార్లంటే మారుతి సుజుకి గుర్తొచ్చేలా త‌న‌దైన ముద్ర‌ను ప్ర‌జ‌లో మదిలో వేసింది. గ‌తంతో పోలిస్తే బ్రాండ్ విలువ 16% పెరిగింది. మొత్తం జాబితాలో ఎక్కువ బ్రాండ్ విలువ పెరిగిన కంపెనీ ఇదే. మార్చి నెల‌లో వితారా బ్రెజా మోడ‌ల్‌ను విడుద‌ల చేసింది. 98% వ‌ర‌కూ దీని త‌యారీ దేశీయంగా జ‌రిగింది.

కారు కొనేట‌ప్పుడు మైలేజ్ గురించి ఆలోచిస్తాం. దాన్ని దృష్టిలో ఉంచుకునే మారుతి స్మార్ట్ హ‌బ్రిడ్ కారు సియ‌జ్‌ను విడుద‌ల చేసింది. లీట‌రుకు 28.09 కిలోమీట‌ర్ల ఇంధ‌న సామ‌ర్థ్యంతో ఇది న‌డుస్తుంద‌ని చెబుతున్నారు.

15. యాక్సిస్ బ్యాంకు

15. యాక్సిస్ బ్యాంకు

బ్రాండ్ విలువ‌: రూ. 101.32 బిలియ‌న్‌

దీపికా ప‌దుకొణెను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకున్న త‌ర్వాత ప్ర‌యివేటు రంగ బ్యాంకుల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును యాక్సిస్ బ్యాంకు సంపాదించుకోగ‌లిగింది. 1994లో ప్రారంభ‌మైన ఈ బ్యాంకు ప్రైవేటు రంగంలోమూడో అతిపెద్దది. ఈ విధంగా ఉత్త‌మ బ్రాండ్ల‌లో ఇది స్థానం సాధించింది.

16. ఐటీసీ

16. ఐటీసీ

బ్రాండ్ విలువ‌: రూ. 86.85 బిలియ‌న్‌

ఐటీసీ కోల్‌క‌త ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తోంది. మొద‌ట టొబాకో(పొగాకు) రంగంతో వ్యాపారం మొద‌లెట్టిన ఈ సంస్థ త‌ర్వాత ఎఫ్ఎమ్‌సీజీలో చాలా విభాగాల‌కు విస్త‌రించింది. అంతే కాకుండా హోట‌ల్స్‌, పేపర్‌బోర్డ్స్‌; ప‌్యాకేజింగ్; అగ్రి బిజినెస్‌, ఐటీలో సైతం దీనికి ప్ర‌వేశం ఉంది. సిగ‌రెట్ వ్యాపారంలో దేశంలో ఐసీటీ మార్కెట్ లీడ‌ర్‌గా ఉంది. ఐటీసీ ప్ర‌ధాన బ్రాండ్ల‌లో ఆశీర్వాద్‌, స‌న్‌ఫీస్ట్‌, క్యాండిమెన్‌, బింగో వంటి వాటిని మీరు వినే ఉంటారు. ఈ కంపెనీ సీఈవోగా వైసీ దేవేశ్వేర్ 20 సంవ‌త్స‌రాలుగా కొన‌సాగారు. పొగాకే కాకుండా వేరే ఇత‌ర విభాగాల‌కు త్వ‌ర‌త్వ‌రగా విస్త‌రించడం ఈ కంపెనీ విజ‌యానికి కార‌ణం. హాస్పిట‌లాటీ విభాగంలో 1996లో ఉన్న 12 నుంచి 100 ప్రాప‌ర్టీల‌కు విస్త‌రించారు. ల‌గ్జ‌రీ హోట‌ళ్ల విభాగంలో ప్ర‌పంచంలోనే హ‌రిత హోట‌ళ్లుగా ఐటీసీ హోట‌ళ్లు ప్ర‌ఖ్యాతి గాంచాయి

17. హెచ్‌సీఎల్‌

17. హెచ్‌సీఎల్‌

బ్రాండ్ విలువ‌: రూ. 83.33 బిలియ‌న్‌

చిన్న గ్యారేజీలో స్టార్ట‌ప్‌లాగా మొద‌లైన‌ప్ప‌టి నుంచి నాలుగు వ‌ర్టిక‌ల్స్‌లో విస‌ర్తించే వ‌ర‌కూ హెచ్‌సీఎల్ ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ వ‌చ్చింది. ఇన్ఫోసిస్ట‌మ్స్‌, టెక్నాల‌జీస్‌, హెల్త్‌కేర్‌, ట్యాలెంట్‌కేర్ విభాగాల్లో ఇది విస్త‌రించింది. 31 దేశాల్లో 1.1 ల‌క్ష ఉద్యోగుల‌ను క‌లిగి ఉంది. గ‌తేడాది కంటే ఒక స్థానాన్ని మెరుగుప‌రుచుకుంది.

మౌలిక నిర్వ‌హ‌ణ‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, బీపీవో, ఇంజినీరింగ్‌, ఆర్ అండ్ డీ మొద‌లైన వాటిలో ఇది సాంకేతిక సేవ‌ల‌ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ట‌మ్స్ సంస్థ‌కు ప్ర‌ధాన ఆయువుప‌ట్టు కాగా ఐటీ సేవ‌లు కూడా ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులుగా ప‌నిచేస్తున్నాయి. సంప్ర‌దాయ టెక్నాల‌జీల‌కు ఆటోమేష‌న్‌తో పాటు, క్లౌడ్, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌, సెక్యూరిటీ సేవ‌లు, ఇంటెలెక్షువ‌ల్ ప్రాప‌ర్టీ వంటి వాటిపై కూడా దృష్టి సారించ‌నున్న‌ట్లు సంస్థ భవిష్య‌త్తు వ్యూహాల‌ను ప్ర‌క‌టించింది.

18. హీరో

18. హీరో

బ్రాండ్ విలువ‌: రూ. 82.53 బిలియ‌న్

ప్ర‌పంచంలోనే 15 ఏళ్ల పాటు టూవీల‌ర్ మార్కెట్లో అగ్ర‌స్థానంలో కొన‌సాగిన హీరో మోటోకార్ప్ 18వ స్థానంలో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 29 దేశాల్లో విస్త‌రించిన ఈ సంస్థ 39% మార్కెట్ వాటాను క‌లిగి ఉంది. హీరో హోండా నుంచి హీరో మాటోకార్ప్‌గా మారిన త‌ర్వాత దాని ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తోంది.

2015లో ప్యాష‌న్ ప్రో, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ లాంటి రెండు మోడ‌ళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. మ్యాస్ట్రో ఎడ్జ్‌, డ్యూయోట్ పేర్ల‌తో రెండు స్కూట‌ర్ల‌ను విడుద‌ల చేసింది. ఆన్లైన్ అమ్మ‌కాల‌ను కూడా ఒడిసిప‌ట్టేందుకు స్నాప్‌డీల్‌తో జ‌ట్టుక‌ట్టింది. త‌ద్వారా ల‌క్ష ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను అమ్మ‌గ‌లిగింది. హాకీ వ‌ర‌ల్డ్ లీగ్ ఫైన‌ల్‌, క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ టీ20 టో్ర్న‌మెంట్‌ల‌లో బ్రాండ్ పార్ట్‌న‌ర్‌గా నిలిచింది. గోల్ఫ్‌లో సైతం టైగ‌ర్ వుడ్ ఫౌండేష‌న్‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ చాలెంజ్‌కు స్పాన్స‌ర్‌గా ఉంది.

19. ఓఎన్‌జీసీ

19. ఓఎన్‌జీసీ

బ్రాండ్ విలువ‌: రూ. 66.08 బిలియ‌న్‌

ఆయిల్ అండ న్యాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్‌(ఓఎన్‌జీసీ) భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఇది స్థానం సంపాదించింది. భార‌త‌దేశ ముడిచ‌మురు ఉత్ప‌త్తిలో 77%, స‌హ‌జ‌వాయువు ఉత్ప‌త్తిలో 81శాతం ఈ కంపెనీయే వాటా క‌లిగి ఉంది. అయితే ఈ బ్రాండ్ గ‌తేడాది కన్నా 10 శాతం విలువ‌ను కోల్పోయింది.

1956 లో ప్రారంభ‌మై ఈ సంస్థ చ‌మురు, స‌హ‌జ‌వాయు నిక్షేపాల అన్వేష‌ణ‌, వెలికితీత‌, ఉత్ప‌త్తుల్లో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది. సొంత చ‌మురు బావులు, స‌హ‌జ‌వాయు స్థావ‌రాలు ఉన్నాయి. విదేశాల్లో సైతం ఇది ఆస్తుల‌ను క‌లిగి ఉంది. దేశంలో 26,600 కి.మీ మేర పైప్‌లైన్ల‌ను ఓఎన్‌జీసీ సొంతంగా ఏర్పాటుచేసి నిర్వ‌హిస్తోంది. దేశంలో ఏ ఇత‌ర కంపెనీ కూడా ఇందులో స‌గం శాతం పైప్‌లైన్ నెట్‌వ‌ర్క్‌ను క‌లిగి లేదు.

ఇటీవ‌లే ఓఎన్‌జీసీ 100 కోట్ల‌తో స్టార్ట‌ప్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.

 20. ఏసియ‌న్ పెయింట్స్

20. ఏసియ‌న్ పెయింట్స్

బ్రాండ్ విలువ‌: రూ. 58.14 బిలియ‌న్‌

ఈ బ్రాండ్ల‌లో స్థానం సంపాదించ‌డ‌మే కాకుండా ఏసియ‌న్ పెయింట్స్ మ‌రో ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. ఫోర్బ్స్ ప్ర‌పంచ అత్యుత్త‌మ సృజ‌నాత్మ‌క కంపెనీల్లో 18వ స్థానంలో నిలిచింది. పెయింటింగ్ రంగంలో 1967 నుంచి మార్కెట్ లీడ‌ర్‌గా ఉంది. కేవ‌లం పెయింటింగ్ వ్యాపారంతో మొదలైన ఈ సంస్థ హోం డెక‌రేష‌న్‌లోకి సైతం అడుగుపెట్టింది. 2013లో స్లీక్ కిచెన్ సొల్యూష‌న్‌ను కొనేసింది. దాని త‌ర్వాత ఈఎస్ఎస్ బాత్రూమ్ ఫిట్టింగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఏసియ‌న్ పెయింట్స్ 17.9 % వృద్దిని క‌న‌బ‌రిచింది. నేపాల్‌, ఫిజి, యూఏఈల‌లో వ్యాపారం సానుకూలంగా ఉండ‌టంతో రెండంకెల వృద్ది సాధ్య‌మైన‌ట్లు కంపెనీ సీఈవో కేబీఎస్ ఆనంద్ చెప్పారు. అంత‌ర్జాతీయ వ్యాపారంలో నెమ్మ‌దిగా ముందుకెళుతున్న‌ట్లు తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+