రిలయన్స్ జియో 4జీ ఫ్రీ వెల్‌కం ఆఫర్
ట్రయల్స్ దశలో్నే వణుకు పుట్టిస్తున్న రిలయన్స్ జియో దెబ్బకు ప్రముఖ టెలికాం సంస్థలైన ఐడియా, ఎయిర్‌టెల్ షేర్లు కుదేలయ్యాయి. గురువారం 42 వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో మాట్లాడుతూ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. జియో కస్టమర్లకు ఉచిత వాయిస్ కాలింగ్, రూ.50కే 1జీబీ డేటాతో ఆఫర్లు ప్రకటించడంతో ఆ ప్రభాం ఇతర టెల్కోలపై బలంగా పడింది.దేశవ్యాప్తంగా రోమింగ్ చార్జీలు సైతం ఉండవని చెప్పారు. దీంతో భారత టెలికాం రంగ దిగ్గజం షేర్లు ఒక దశలో 8.99 శాతం పడిపోయి ప్రస్తుతం 6.51% నష్టాల్లో కొనసాగుతుండగా, మూడో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ అయిన ఐడియా సెల్యూలార్ షేరు 9 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతోంది.

ముకేశ్ అంబానీ నేటి వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో వినియోగదారులకు 'ఫ్రీ వెల్‌కం ఆఫర్' ప్రకటించారు. సెప్టెంబరు 5 న ఫ్రారంభమై డిసెంబరు 31న ముగుస్తుంది. ఈ నాలుగు నెలలు అన్ని సర్వీసులు ఉచితం. ఆ తర్వాత దాదాపు పది టారిఫ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
డిజిటల్ ఇండియాలో భాగంగా విద్యార్థులకు అదనంగా డేటాను అందచేయనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ అధినేత విద్యార్థి గుర్తింపు కార్డు కలిగిన వారికి 25% డేటా అదనంగా ఇవ్వనునన్నట్లు చెప్పారు.
2017 మార్చి నాటికి దేశంలో 90 శాతం ప్రాంతాన్ని కవర్ చేసేలా జియో ప్రణాళికలు ఉన్నాయి. రూ. 2999 కే 4జీ మొబైల్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల మంది వినియోగదారులను చేర్చుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.


Click it and Unblock the Notifications