52 వారాల గరిష్టానికి సెన్సెక్స్
అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 450 పాయింట్ల మేర లాభపడింది. విదేశీ, దేశీయ ఆర్థిక సంస్థలు భారీగా కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు భారీగా లాభాల దిశగా పయనించాయి.
ఆటో, ఫైనాన్సియల్ రంగాల్లో లాభాలు రావడంతో పాటు డీఎల్ లిమిటెడ్ ఫలితాలు సానుకూలంగా రావడంతో మార్కెట్లు రాణించాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 440.35(1.58%) పాయింట్లు లాభపడి 28,343 వద్ద, 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 136.9(1.59%) పాయింట్లు పైకి ఎగబాకి 8744.35 వద్ద ముగిశాయి.
ఈ రోజు సెన్సెక్స్ గరిష్ట స్థాయి 28,478 కాగా కనిష్ట స్థాయి 28010.66.

రంగాల వారీ చూస్తే ఆటో ఇండెక్స్ 1.81%, ఐటీ రంగం 1.77%, బ్యాంకింగ్ 1.49%, ఎఫ్ఎమ్‌సీజీ 1.41% మేర లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో బాగా లాభపడ్డ వాటిలో ఏసియన్ పెయింట్స్(3.2%), బజాజ్ ఆటో(3.09%), మారుతి(2.83%), గెయిల్(2.695%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(2.35%) ఉండగా భారతి ఎయిర్‌టెల్ 2.82% మేర నష్టపోయింది.
నికర లాభం రెండింతల కన్నా ఎక్కువ ఉన్నట్లు ఫలితాలను ప్రకటించిన డీఎల్ఎఫ్ 3.2 శాతం మేర లాభపడింది. జూన్ త్రైమాసికానికి మంచి లాభాలను వెల్లడించిన ఇండియన్ ఆయిల్ కార్ప్ సైతం 1.62% మేర లాభపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.06 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications