పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ముందుకెళుతోంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 10 నుంచి 27కు పెరగనుంది. అక్టోబర్ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సంఖ్య సైతం పెరగనుంది. రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం ఉన్న 44 నుంచి 58కి, మండలాల సంఖ్య 490కు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్‌ను అలానే ఉంచారు. హైదరాబాద్ జిల్లా విభజన గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసమై ఒక నెల సమయమిచ్చారు. ప్రజలు 30 రోజుల్లోపు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపవచ్చు. జిల్లా కలెక్టరు కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయాల్లో తమ అభిప్రాయాలను తెలపవచ్చు. http://newdistrictsformation.telangana.gov.in/FirstPage.do వెబ్సైట్లో సైతం తమ అభ్యంతరాలను ఆన్లైన్లో తెలపవచ్చు.
మొత్తం ప్రక్రియను సెప్టెంబరు చివరి నాటికి పూర్తిచేసి కొత్తజిల్లాలను దసరా కల్లా ఉనికిలోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications