ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, తన దాతృత్వ సంస్థకు ఫండ్ కోసం భారీ మొత్తంలో తన సొంత షేర్లను విక్రయించారు. 95 మిలియన్ డాలర్ల(రూ. 637కోట్లకు పైగా) విలువ చేసే 760,000లకు పైగాఫేస్‌బుక్ స్టాక్ లోని షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో జుకర్ బర్గ్ పేర్కొన్నారు. చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ హోల్డింగ్స్, చాన్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్ ద్వారా ఈ విక్రయం జరిపినట్టు వెల్లడించారు. 122.85 డాలర్ల నుంచి 124.31 డాలర్ల శ్రేణిలో ఈ షేర్ల ధరలు నమోదయ్యాయి. చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ ద్వారా హెల్త్, సైన్సు, ఎడ్యుకేషన్ సమస్యల పరిష్కారానికి ఫండ్‌ను అందించడానికి ఇంతమొత్తంలో షేర్లను విక్రయిచడం ఇదే మొదటిసారి. తన కూతురు మాక్స్ పుట్టిన సందర్భంగా 2015లో తన కంపెనీలోని 99 శాతం షేర్లను అంటే 45 బిలియన్ డాలర్లను దానం చేసేయాలని జుకర్, ఆయన భార్య ప్రిన్సిలా చాన్ నిర్ణయించారు.

ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు చాన్ జుకర్ బర్గ్ ఈ సంస్థను ప్రారంభిస్తున్నామని కూడా పేర్కొన్నారు. మనుషుల శక్తి సామర్థ్యాలు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, సమానహక్కులు కల్పించి, కమ్యూనిటీలను అభివృద్ధి చేసేందుకు ఈ ఇనీషియేటివ్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన నెలలోనే 99 శాతం ఫేస్బుక్ షేర్లను చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్‌కు ట్రాన్సఫర్ చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల తర్వాత నుంచి ఫండ్ కోసం వార్షికంగా 1 బిలియన్ వరకు షేర్లను విక్రయించనున్నట్టు కూడా వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications