దేశంలో అందరికీ పింఛను ఉండేలా రూపొందించిన అటల్ పింఛను యోజనకు తగినంత స్పందన లేదని గుర్తించిన ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అటల్ పెన్షన్ యోజనా (ఎపివై) పథకంలో ఎక్కువ మంది చేరేందుకు అనుకూలంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఆర్‌డిఏ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకు పొదుపు ఖాతా వివరాల ఆధారంగా ఎపివై ఖాతాదారులను నమోదు చేసే అవకాశాన్ని బ్యాంకులకు కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఎపివై మాడ్యుల్‌ను బ్యాంకుల కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సిబిఎ్‌స)కు అనుసంధానం చేసినట్లు తెలిపింది. దీని ఫలితంగా బ్యాంకులు ఎపివైలో చేరాలనుకునే ఖాతాదారు సేవింగ్స్ ఖాతాను ఎంటర్ చేస్తే ఎపివై మాడ్యుల్ అటోమెటిక్ సంబంధిత వ్యక్తికి సంబంధించిన వివరాలను బ్యాంకుల మాస్టర్ డేటా బేస్ నుంచి అందిస్తుందని, అంతేకాకుండా ఖాతాదారుకు శాశ్వస రిటైర్‌మెంట్ ఖాతా నంబర్ (పిఆర్‌ఎఎన్)ను తక్షణమే అందిస్తుందని పేర్కొంది. ఈ నెంబర్ కలిగిన ఎపివై ఖాతాదారు నెల/త్రైమాసికం/ఆరు నెలలవారీగా చందాను జమచేయవచ్చు.
ఈ మొత్తం సేవింగ్స్ ఖాతా నుంచి డెబిట్ అయి ఎపివై ఖాతాలో జమఅవుతుంది. 18-40 ఏళ్ల మధ్యనున్న ప్రతి పౌరుడు కూడా ఎపివైలో చేరవచ్చు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 31.85 లక్షల మంది ఈ పథకంలో చేరారు. ఈ పథకంలో చేరిన వారు చెల్లించే చందాను బట్టి ఉద్యోగం మానేసిన తర్వాత నెలకు 1,000-5,000 రూపాయల పెన్షన్‌ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగిన యువత ఎపివైలో చేరేందుకు పిఎ్‌ఫఆర్‌డిఎ ఇప్పటికే అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ తదితర బ్యాంకులు ఇప్పటికే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇతర బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.



Click it and Unblock the Notifications