ఆంధ్రా బ్యాంక్.. పొదుపు, డీమాట్, ట్రేడింగ్ ఖాతాలతో కూడిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎబి ఈ-ట్రేడ్'ను ప్రారంభించింది. ఇందుకోసం ఆంధ్రా బ్యాంకు, జియోజిత్ బీఎన్‌పీ పరిబస్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌తో జట్టుకట్టింది. జియోజిత్ బీఎన్‌పీ పరిబస్ మేనేజింగ్ డైరెక్టర్ సిజె జార్జ్‌తో కలిసి ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా పొదుపు ఖాతా, డీమాట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లన్నీ ఒకే ప్యాకేజీలో ఉండేలా త్రీ ఇన్ వన్ ఆన్‌లైన్ పెట్టుబడి ఖాతాను ఆంధ్రా బ్యాంక్ ఆఫర్ చేయనుంది. దీని ద్వారా కస్టమర్లంతా.. నేరుగా ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్, ఇతర క్యాపిటల్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. వినియోగదారులకు అనుకూలంగా ఉండే, సులభమైన ట్రేడింగ్ ఫీచర్లతో ఎబి ఇ ట్రేడ్‌ను రూపొందించినట్లు ఆంధ్రా బ్యాంక్ ఎండి, సిఇఒ సురేష్ ఎన్ పటేల్ తెలిపారు.

కాల్ ఆన్ ట్రేడ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా బ్యాంకు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఎప్పటికప్పుడు వినియోగదారులు వాడుకోవచ్చని ఆంధ్రాబ్యాంకు ప్రకటించింది. మల్టీ ఛానల్ యాక్సెస్, మార్కెట్ సమయం ముగిసిన తర్వాత సదుపాయాలను క్లయింట్లకు అందించనున్నట్లు పేర్కొంది. ఎబీ ఈ-ట్రేడ్ ప్లాట్‌ఫాం ద్వారా రీసెర్చ్ నివేదికలు, లైవ్ న్యూస్, టెక్నికల్ అనాలిసిస్, వివిధ కంపెనీల చార్టులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications