సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్ లిమిటెడ్ (సింగ్టెల్) దేశీయ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలను కొనుగోలు చేయనుంది. టెమాసెక్(7.39 శాతం) వాటా కొరకు 659.5 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు భారత టెలికాం రంగంపై విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడతాయని పలువురు అంటున్నారు.
భారత్‌లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్‌కు భారతీ టెలికాం హోల్డింగ్ కంపెనీగా ఉంది. ఈ సంస్థలో తాజా వాటా కొనుగోలు కోసం సింగ్టెల్ 659.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4400 కోట్లు) వెచ్చించనుంది. భారతీ టెలికాంలో టెమాసెక్‌కు ఉన్న 7.39 శాతం వాటాను సింగ్టెల్ సొంతం చేసుకోనుంది. ప్రతీ భారతీ టెలికాం షేరుకు రూ.235.62 చొప్పున చెల్లించనుంది. నూతన చర్య వల్ల భారతి టెలికాం హోల్డింగ్‌లో సింగ్టెల్ వాటా ఇంతకు ముందున్న 39 నుంచి 46.39 శాతానికి పెరగనుంది. మిట్టల్ కుటుంబానికి ఎయిర్టెల్ సంస్థలో మెజారిటీ (51% ) వాటా ఉంది.

రెండో పెద్ద వాటాదారుగా సింగ్టెల్
భారతీ ఎయిర్టెల్ సంస్థలో భారతీ టెలికాంకు 45.09 శాతం వాటా ఉంది. ఇప్పటి వరకూ మిట్టల్ కుటుంబానికి 51%, సింగ్‌టెల్‌కు 39%, టెమాసెక్ సంస్థకు 7.39% వాటాలున్నాయి. ఇప్పుడు టెమాసెక్ వాటా సైతం సింగ్టెల్ చేతిలోకి వెళుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications