కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి లక్ష్యాన్ని చేరుకోలేదని కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ ఇండసీ్ట్ర్‌స (ఆర్‌ఐఎల్)పై మరో రూ.2,500 కోట్ల జరిమానా విధించింది. ఉత్పత్తి పంపిణీ వ్యయానికి సంబంధించి ప్రభుత్వంతో జరిగిన ఒప్పంద ప్రకారం.. గ్యాస్ అమ్మగా వచ్చిన ఆదాయం నుంచి బావుల అభివృద్దికయ్యే వ్యయాన్ని మినహాయించుకొన్న తర్వాతే సంస్థ లాభాలను ప్రభుత్వంతో పంచుకుంటుంది. దీన్ని ఉల్లంఘించిందనేది ప్రభుత్వ ఆరోపణ. దీంతో ప్రభుత్వం జరిమానాలను విధిస్తోంది. ఏప్రిల్ 2010 నుంచి ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్‌పై విధించిన జరిమానా 276 కోట్ల డాలర్లకు (సుమారు రూ.18,492 కోట్లు) చేరింది. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు (పిఎ్‌ససి) పద్దతిలో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. తాజా జరిమానాలతో రిలయన్స్ ఉత్పత్తి ఖర్చులను కూడా మినహాయించుకునే అవకాశం ఉండదు. అయితే రిలయన్స్ దీనిపై అర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)ను ఆశ్రయించింది.

2013-14 ఆర్థిక సంవత్సరం వరకూ బావుల అభివృద్ది వ్యయంలో 237.6 కోట్ల డాలర్లు రికవరీ చేసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించిందని, ఫలితంగా లాభంలో సర్కారుకు చెల్లించాల్సిన వాటా మరో 19.53 కోట్ల డాలర్లు పెరిగిందని సంస్థ తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం వరకూ క్లెయిం డిమాండ్‌లో నిరాకరించిన వ్యయ నిరాకరణ మొత్తం 275.6 కోట్ల డాలర్లకు పెరిగిందని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 24.69 కోట్ల డాలర్ల లాభాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ నియంత్రణ మండలి వద్ద వాదిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications