పేరున్న ఫార్మా సంస్థల్లో మన హైదరాబాదీ కంపెనీలు
దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్లలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 4వ స్థానంలో నిలిచింది. టీఆర్‌ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా 'భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016' పేరిట ఒక నివేదికను రూపొం దించాయి. ఈ జాబితాలో అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మాలు వరుసగా 11, 21వ స్థానాల్లో ఉన్నాయి. అటు సువెన్ లైఫ్ సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ లేబొరేటరీస్ (44), జెనోటెక్ లేబొరేటరీస్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ 52వ ర్యాంకుల్లో నిలిచాయి.

జాబితాలో ముంబయికి చెందిన లుపిన్ ప్రథమ స్థానంలో ఉండగా, 2,3 స్థానాల్లో సన్‌ఫార్మా, సిప్లా నిలిచాయి. 58 బ్రాండ్లను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందలుఓ 41 దేశీయ సంస్థలుండగా మిగిలినవి విదేశీ సంస్థలు. దేశంలో ఎక్కువగా పరపతి కలిగిన కంపెనీల(ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్) జాబితాలో ఇది రెండోది. మీడియాలోను, వినియోగదారుల్లోనూ ఆయా బ్రాండ్లపై ఉన్న విశ్వసనీయతను విశ్లేషించి, తదనుగుణంగా ర్యాంకులు ఇవ్వడం జరిగిందని ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడడ్ బ్రాండ్స్ ప్రతినిధి పూజా కౌరా తెలిపారు.
2020 నాటికి వేగవంతమైన వృద్ది కలిగిన రంగాల్లో ఫార్మా మొదటి మూడింటిలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఫార్మా రంగంపై గతేడాది జూలై 15- ఈ ఏడాది జూలై 16 మధ్యలో వచ్చిన 24,414 వార్తల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌లో పేరొందిన విదేశీ బ్రాండ్స్ విషయానికొస్తే జీఎస్‌కే అగ్రస్థానంలోనూ, ఫైజర్, అబాట్ తదుపరి స్థానాల్లోనూ నిలిచాయి.


Click it and Unblock the Notifications