తమ పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండకూడదనే మదుపుదార్లు దీర్ఘకాల పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతారు. అయితే దీర్ఘకాలంలో రాబడి రావాలనే కోరుకుంటారు. ఈక్విటీలు(షేర్లు), ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వంటివి ఎక్కువ రాబడులనిచ్చినప్పటికీ రిస్క్ ఉంటుంది. ఏదైనా పెట్టుబడిని ఎంచుకునే ముందు వీటిని చూడాలి.
పెట్టుబడి కాలం: ఎంత కాలం పెట్టుబడి పెడతారు
లిక్విడిటీ: పెట్టుబడిని ఎంత త్వరగా నగదు రూపంలో మార్చుకోవచ్చు
పన్ను: ఆర్థిక సాధనానికి సంబంధించి వర్తించే పన్నులు, వచ్చే మినహాయింపులు
ఇవన్నీ చూసిన తర్వాత తగిన పెట్టుబడిని ఎంచుకోవడానికి వీటిని పరిశీలించండి

1. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మీకు 6.6 నుంచి 7.5 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరం కాలం కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టేట్లయితేనే ఎఫ్‌డీల వైపు చూస్తే మంచి రాబడి వస్తుంది. పన్ను శ్లాబును బట్టి రూ. 10 వేల కంటే ఎక్కువ వడ్డీ వచ్చినప్పుడు పన్ను కట్టాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాని వారు ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను సమర్పించాలి.అలా చేస్తే మూలం వద్ద పన్ను మినహాయించరు.

2. రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ)
రికరింగ్ డిపాజిట్ చేయడం మూలంగా నెలవారీ క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ వడ్డీపై సైతం టీడీఎస్ కట్ చేస్తారు. ఆర్‌డీ సైతం దాదాపు బ్యాంకు డిపాజిట్ లాగే ఉంటుంది. 10 వేల మొత్తాల్లో టీడీఎస్‌ను లెక్కిస్తారు.

3. పీపీఎఫ్
వేతన జీవులు చాలా మంది ఇష్టపడే పెట్టుబడి సాధనం పీపీఎఫ్. పీపీఎఫ్‌ని ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి వడ్డీ ఆదాయానికి పన్ను ఉండదు. రెండోది 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకో విధంగా పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.

4. నెలవారీ ఆదాయ పథకాలు
తక్కువ రిస్క్ తీసుకుంటూ మంచి పెట్టుబడి రాబడి ఉండాలనుకునే వారు పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాల వైపు చూడవచ్చు. సీనియర్ సిటిజన్లు లేదా పదవీ విరమణ చేసిన వారికి ఇవి బాగా నప్పుతాయి. ఈ పథకాలకు భారత ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి సురక్షితమైనవి. గత కొన్ని త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ వీటి వడ్డీ రేట్లు బాగానే ఉన్నాయి.

5. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్
సీనియర్ సిటిజన్స్‌కు వివిధ రంగాల్లో ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వ చాలా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాంటి వాటిలో ఈ స్కీమ్స్ ఒకటి. ప్రతి త్రైమాసికానికి వీటి వడ్డీ రేట్లను భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం వీటి వడ్డీ రేట్లు 8.7 శాతంగా ఉన్నాయి

6. సుకన్య సమృద్ది పథకం
అమ్మాయిల వివాహం, ఉన్నత విద్య కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి సుకన్య సమృద్ది పథకం బాగా ఉంటుంది. బేటీ బచావో-బేటీ పడావో అనే నినాదంతో ప్రభుత్వం ప్రారంభించిన పలు చర్యల్లో ఇది ఒకటి. సుకన్య సమృద్ది ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసు కార్యాలయాల్లో తెరవొచ్చు. 80 సీ మినహాయింపులు ఉన్నాయి.

7. డెట్ మ్యూచువల్ ఫండ్లు
డెట్ మ్యూచువల్ ఫండ్లు బ్యాంకు డిపాజిట్ల కంటే మంచి రాబడులనే అందిస్తున్నాయి. ఈక్విటీల్లో సైతం కొంత డబ్బు పెట్టుబడి పెడుతున్నందువల్ల డెట్ మ్యూచువల్ ఫండ్లు బాగానే రాణిస్తున్నట్లుగా చెప్పొచ్చు.

8. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం మూలంగా 80సీ కింద మంచి పన్ను మినహాయింపులను పొందవచ్చు. ఇవి తక్కువ లాక్ ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్దమైన రిస్క్‌కు సిద్దపడి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడి కావాలనుకునే వారు వీటివైపు చూడొచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications