సంఘటిత రంగాల్లోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) ఉంటుంది. అదే రీతిలో అసంఘటిత రంగ కార్మికులకు దీర్ఘకాలంలో ఆర్థిక రక్షణ కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) సదుపాయాన్ని కల్పించారు. ఇందులో సాధారణ ప్రజలు సైతం భాగస్వాములుగా చేరవచ్చు. అదనపు డబ్బు ఉండి అత్యవసరాల్లో కావాలనిపించి పెట్టుబడి వెనక్కు తీసుకునే వీలు కోసం చాలా మంది ఎఫ్‌డీలను ఆశ్రయిస్తారు. 7,8 ఏళ్లకు పైబడి పెట్టుబడి పెట్టగలమని భావించే వారికి పీపీఎఫ్, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఏది బెటర్ అని అడిగితే ముము పీపీఎఫ్‌నే సూచిస్తాం. పీపీఎఫ్‌నే సూచించేందుకు గల 6 కారణాలను ఇక్కడ తెలుసుకోండి.

1. వడ్డీ రేట్లు
బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఎప్పటికైనా పీపీఎఫ్ ద్వారానే ఎక్కువ వడ్డీనే అందుకోవచ్చు. పీపీఎఫ్ ద్వారా ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ వస్తుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై 7.5 శాతం దాకా వడ్డీ వస్తోంది.

2. వడ్డీపై పన్ను
బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను పడుతుంది. పన్ను లెక్కించేటప్పుడు ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీని మొత్తం ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు కలదు.

3. సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాలు
పీపీఎఫ్‌లో రూ. 1.5 లక్ష వరకూ పెట్టే పెట్టుబడికి పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందుకోవచ్చు.
చాలా బ్యాంకు డిపాజిట్లపై ఈ సౌకర్యం అందుబాటులో లేదు. ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్‌కు మాత్రం ఉంటుంది.

4. పదవీ విరమణ నిధి ఏర్పాటు
పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు. దీంతో ప్రతి ఒక్కరూ పదవీ విరమణ నిధి ఏర్పాటు చేసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.

5. సులభంగా నగదుగా మార్చుకునే వీలు
పీపీఎఫ్‌లతో పోలిస్తే బ్యాంకు డిపాజిట్లను కావాల్సినప్పుడల్లా విత్‌డ్రా చేసుకునేందుకు సత్వర వీలుంటుంది. గడువు తేదీకి ముందే అవసరమైతే డిపాజిట్లను వెనక్కి తీసుకునే సౌకర్యం ఉండగా, పీపీఎఫ్‌లో ఇది లేదు.
7 ఏళ్ల తర్వాత నుంచి పాక్షిక విత్‌డ్రాయల్ చేయవచ్చు. అయితే ఇది(పీపీఎఫ్ కార్పస్) దీర్ఘకాలంలో కుటుంబ అవసరాలకు పనికొస్తుంది.

6. ముగింపు
పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాల కోసం ఎక్కువ డబ్బును మదుపు చేయాలంటే పీపీఎఫ్ బాగా ఉంటుంది. అంతే కాకుండా దానిపై వచ్చే వడ్డీకి పన్ను ఉండకపోవడం మంచి అంశం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఏ విధంగానైనా ఇది బెటరే. దీర్ఘకాల పెట్టుబడి అనే సంగతి మాత్రం గుర్తుంచుకోండి. 7 ఏళ్ల తర్వాత నుంచే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ లేని వారికి ఇది బాగా ఉపకరించగలదు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications