అహర్నిశలు సంపద పోగేసి బిలియనీర్లు అవుతారు. అయితే దీన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి. అయితే అలాగని వారు సరాదాలకు దూరంగా ఉండరు. వారి హాబీల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. అయితే చాలా మంది పుస్తకాలు చదవడం ద్వారా ఎక్కువ మంది సంతృప్తిని పొందుతారని భావిస్తారు. అయితే బిలియనీర్ల తీరు ఇందుకు భిన్నంగా ఉంది.
వెల్త్ ఎక్స్ అధ్యయనం ప్రకారం గతేడాది బిలియనీర్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2473 కు పెరిగింది. మొత్తం అందరీ సంపద కలిపి 7.7ట్రిలియన్స్‌కు పెరిగింది. అధ్యయనం ప్రకారం మొత్తం ప్రపంచ సంపదలో వీరి వద్దే 3.9 శాతం ఉంది. వీరందరిలోకి ఉన్న ఉమ్మడి లక్షణం వ్యవస్థాపకత. వెల్త్ఎక్స్ విశ్లేషణ ఆధారంగా చూస్తే 87 శాతం మంది వారు సొంతగా కష్టపడి సాధించుకున్న సంపదే ఎక్కువ. అలా సంపాదన బాటలో ఉన్న వారంతా ఏమి చేస్తారో తెలుసుకోవాలంటే ఈ కింద వివరాలను చదవండి.

సంపన్నుల అభిరుచులు
ఈ వెల్త్ ఎక్స్ అధ్యయనంలో కేవలం సంపద గురించే కాకుండా వారి అలవాట్లు, హాబీల గురించి సైతం చర్చించారు. మొత్తానికి అందరిలో ఎక్కువ శాతం మంది సమాజ సేవకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. సగం కంటే ఎక్కువ శాతం(56%) బిలియనీర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం మంచి విషయం.

సంపన్నుల అభిరుచులు
బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ చేస్తున్న కృషిని గూర్చి ప్రపంచమంతా చర్చిస్తుండటం మూలంగా ఈ సేవలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతూ ఉండొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ సామాజిక సేవలను పక్కన పెడితే తర్వాతి స్థానాల్లో ట్రావెల్, కళలు, ఫ్యాషన్, స్టైల్ వంటివి ఉన్నాయి.

సంపన్నుల అభిరుచులు
సామాజిక సేవల కార్యక్రమాలకు అత్యధికంగా 56.3 శాతం మొగ్గుచూపుతుండగా, స్కైయింగ్‌కు అతి తక్కువగా 7.2 శాతం, దాని తర్వాత స్థానంలో వాచీల కొనుగోలు(7.7%), ఫిషింగ్(7.8%) వైపు ఆసక్తి కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

సంపన్నుల అభిరుచులు
మొత్తం బిలియనీర్లలో ప్రయాణాలవైపు 31.0 శాతం, కళల వైపు 28.7 శాతం మంది మొగ్గుచూపుతుండగా, ఫ్యాషన్ అండ్ స్టైల్ అంశంలో సైతం 25.2 శాతం మంది ఆసక్తిని కనబరుస్తున్నట్లు వెల్లడయ్యింది.

సంపన్నుల అభిరుచులు
రాజకీయాల్లో 22.2%, వైన్,స్పిరిట్‌ల్లో 15.9%, బోటింగ్‌లో 14.9%, ఆరోగ్యం, వ్యాయామ కార్యకలాపాల్లో 14.8%, ఆటోమొబైల్స్‌లో 14.8% మంది తమ అభిరుచిని కలిగి ఉండగా, వస్తు సేకరణ హాబీగా కలిగిన వారు 14.1 శాతం ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.

సంపన్నుల అభిరుచులు
ఫుట్‌బాల్ లేదా సాకర్ ఆటను 13.1 శాతం మంది ఆడేందుకు ఇష్టపడుతుండగా, పుస్తకాలు చదివేందుకు 12.3% మంది తమ ఆసక్తిని వెలిబుచ్చుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వైపు 12.1% మందికి మనసు మళ్లగా, గోల్ప్ క్రీడ ఆడటానికి 11.0% మంది సమయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సంపన్నుల అభిరుచులు
హంటింగ్(వేట) హాబీగా కలిగిన వారు 8.8% మంది, ఆభరణాలపై మోజు 8.1% మంది, ఫిషింగ్ అలవాటు ఉన్నవారు 7.8% ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications