28 వేలను దాటిన సెన్సెక్స్‌

స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1 శాతం లాభంతో దాదాపు 292 పాయింట్లు పైకి ఎగ‌సింది. వారం వారీగా చూస్తే వ‌రుస‌గా మూడో వారం స్టాక్ మార్కెట్ లాభాల‌తో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 292.80 పాయింట్లు(1.05%) లాభప‌డి 28,152.40 పాయింట్ల వ‌ద్ద, నిఫ్టీ 80 పాయింట్ల(0.93%) లాభంతో 8,672దగ్గర క్లోజ్ అయ్యాయి. మొత్తం వారానికి బీఎస్ఈ సెన్సెక్స్ 0.26 శాతం లాభాన్ని న‌మోదు చేసింది. ఎన్ఎస్ఈ సూచీ వారానికి 0.13 శాతం న‌ష్టాల‌ను న‌మోదు చేసింది.

 28 వేలను దాటిన సెన్సెక్స్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఈ రోజు 7.1 శాతం లాభప‌డ్డాయి. రిల‌య‌న్స్ 2.1 శాతం లాభ‌ప‌డింది.
దేశీయ స్టాక్ ఎక్స్చేంజీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, ఎస్ బ్యాంక్‌, హిందాల్కో, టాటా మోటార్స్ షేర్లు లాభాల‌తో ముగియ‌గా; భార‌త్ పెట్రోలియం, టెక్ మ‌హీంద్రా, సిప్లా, ఐడియా, ఇన్ఫోసిస్ షేర్లు న‌ష్ట‌పోయాయి.
ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వ‌ సంద‌ర్భంగా దేశీయ మార్కెట్ల‌కు సోమ‌వారం సెల‌వు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+