రిల‌య‌న్స్ జియో రాక‌-టెలికాం రంగంలో కాక‌

ముంద‌స్తు సేవ‌ల ప‌రీక్ష‌ల్లో భాగంగా రిల‌య‌న్స్ జియో అందిస్తున్న ప‌రిమిత స్థాయి యూజ‌ర్ల విష‌య‌మై మెల్ల‌గా మొద‌లైన వాగ్వాదం మరింతగా ముదురుతోంది. సీవోఏఐలో స‌భ్య‌త్వం ఉన్న కొన్ని కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను కృత్రిమంగా, అక్రమంగా బ్లాక్‌ చేస్తున్నాయని రిలయన్స్‌ జియో వాదిస్తోంది. ఫలితంగానే తమ సర్వీసుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని అంటోంది. భార‌తి ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్ వంటి సంస్థ‌లు ప్ర‌ధాన స‌భ్యులుగా ఉన్న కాయ్‌... ఆయా కంపెనీల ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌ను బ‌లిచేస్తున్నార‌ని విమ‌ర్శిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ వాద ప్ర‌తివాదాలేంటో చూద్దాం.

 రిల‌య‌న్స్ జియో స్పంద‌న

రిల‌య‌న్స్ జియో స్పంద‌న

ప‌రీక్ష‌ల ముసుగులో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రిల‌య‌న్స్ జియో పూర్తి స్థాయి టెలికాం సేవ‌ల‌ను అందిస్తోందంటూ ఇత‌ర ప్ర‌ముఖ టెలికాం కంపెనీలు చేసిన ఆరోప‌ణ‌ల‌పై జియో తీవ్రంగా స్పందించింది. త‌మ టెలికాం సేవ‌ల‌ను అడ్డ‌కునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించింది. జీఎస్ఎం ఆప‌రేట‌ర్ల సమాఖ్య, సీవోఏఐ వాద‌న‌ల‌ను ఖండిస్తూ బుధ‌వారం 8 పేజీల లేఖను విడుద‌ల చేసింది. సీవోఏఐ ఆరోప‌ణ‌లు ద్వేష‌పూరిత‌మైన‌వ‌ని, నిరాధార‌మైన‌వ‌ని, అవాస్త‌వాల‌తో కూడుకున్న‌వ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆధిప‌త్యం చెలాయిస్తున్న ఆప‌రేట‌ర్ల స్వార్థ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేవిగా ఇవి ఉన్నాయ‌ని వ్యాఖ్యానించింది. పోటీ స్ఫూర్తికి విరుద్దంగా ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్లు త‌మ నెట్‌వ‌ర్క్‌ను అక్ర‌మంగా అడ్డుకుంటున్నాయ‌ని ఆర్‌జియో సీనియ‌ర్ అధికారి ఆరోపించారు.

ఇంట‌ర్‌క‌నెక్టివిటీ స‌మ‌స్య‌...

ఇంట‌ర్‌క‌నెక్టివిటీ స‌మ‌స్య‌...

ఏడాది కాలంలో 10 కోట్ల పైగా క‌స్ట‌మ‌ర్ల‌ను చేరాలని నిర్దేశించుకున్నామని, దీనికి త‌గ్గ‌స్థాయిలో ఇంట‌ర్‌క‌నెక్టివిటీ స‌దుపాయం క‌ల్పించేందుకు ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్లు కూడా వారి వారి ట‌వ‌ర్ల సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌రుచుకోవాల్సి ఉంద‌ని రిల‌య‌న్స్ జియో వివ‌రించింది. ఇందుకోసం ఆయా ఆప‌రేట‌ర్ల‌కు కొ్ని చోట్ల త‌మ సొంత ఖ‌ర్చుతో ప‌రిక‌రాల‌ను కూడా అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. కానీ ఆయా ఆప‌రేట‌ర్లు పాయింట్ ఆఫ్ ఇంట‌ర్‌క‌నెక్ష‌న్ల‌ను(అంటే ఒక‌దాని నుంచి మ‌రో దానికి అనుసంధానించేవి) కూడా మెరుగుప‌రుచుకోవ‌డం లేద‌ని, పైగా త‌మ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆర్‌జియో వాదిస్తోంది.

 మా టెస్ట్ యూజ‌ర్ల‌కు ఇబ్బంది

మా టెస్ట్ యూజ‌ర్ల‌కు ఇబ్బంది

ఇంటర్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల పీవోఐల వద్ద రద్దీ ఎక్కువై.. కాల్స్ కలవటం లేదు. దీంతో ప్రస్తుతం మాకున్న 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాల్ వైఫల్యాల ఉదంతాలు ఏకంగా 65 శాతం మేర ఉంటున్నాయి. ఈ స్థాయిలో కాల్ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్న పరిస్థితుల్లో మేం వాణిజ్యపరమైన సేవలు ప్రారంభించడం తెలివైన పని కాదు. ఒకవేళ ప్రారంభిస్తే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసే ఆర్‌జియో యూజర్లకు, అలాగే వేరే టెలికం సంస్థల నుంచి మా నెట్‌వర్క్‌కు కాల్స్ చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి'' అని ఆర్‌జియో వివరించింది.

 మ‌మ్మ‌ల్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారు: జియో

మ‌మ్మ‌ల్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారు: జియో

సీవోఏఐ ఆరోప‌ణ‌లను రిల‌య‌న్స్ జియో ధీటుగానే కొట్టిపారేస్తోంది. ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న సంస్థ‌లు సీవోఏఐ రూపంలో కొత్త సంస్థ జియోను మార్కెట్లోకి ప్ర‌వేశించ‌కుండా వివిధ మార్గాల్లో అడ్డుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా ఆరోపించింది. ఇందులో భాగంగా ఉద్దేశ‌పూర్వ‌కంగా వివిధ మీడియాల్లో అస‌మంజ‌స‌మైన నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా ఒక లేఖ‌ను పేర్కొంది. తాము భార‌త్‌లోనే మొట్ట‌మొద‌టిసారి యునిఫైడ్ లైసెన్స్ పొంది ఎల్‌టీఈ వాయిస్‌, డేటా స‌వేల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని, ఇందులో భాగంగానే వాణిజ్య సేవ‌ల ప్రారంభానికి ముందే భ‌విష్య‌త్తులో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు జియో పేర్కొంది. తమ వద్ద ఉన్న చందాదారుల వివరాలను అందజేస్తున్నట్లుగా వివరించింది. సేవలను విస్తరించేందుకు అవసరమై 'పాయింట్‌ ఆఫ్‌ ఇంటర్‌ కనెక్ట్‌' (పిఒఐ) అందించాలని ట్రాయ్ కి విన్నవిస్తున్నప్పటికీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టెలికాం సంస్థలు తమ వ్యాప్తిని అడ్డుకొనేందుకు సరిపడా పిఒఐలనును అందించడం లేదని ఆరోపించింది.

 బీటా స్టేజ్‌లో రిల‌య‌న్స్ జియో

బీటా స్టేజ్‌లో రిల‌య‌న్స్ జియో

మొత్తం స‌మ‌స్యంతా రిల‌య‌న్స్ 4జీ లేదా ఎల్‌టీఈ ట్ర‌య‌ల్. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ బీటా స్టేజ్ పూర్త‌వుతుంది. రిల‌య‌న్స్ జియో ప‌రీక్ష‌ల దశ‌లో ఉండ‌గానే ఇత‌ర టెలికాం కంపెనీలు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు పోటీ ప‌డి మ‌రీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ట్రాయ్‌కి రాసిన లేఖ‌లో ఈ ప్రాజెక్టు కోసం తాము ఇప్ప‌టికే 1.34 ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించామ‌ని, ప్రాజెక్టు త‌దుప‌రి ద‌శ‌లో మ‌రో 1.5 ల‌క్ష‌ల కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టునున్న‌ట్లు జియో తెలిపింది.

ఆగ‌స్టు 15న ప్రారంభం: రిల‌య‌న్స్ జియో

ఆగ‌స్టు 15న ప్రారంభం: రిల‌య‌న్స్ జియో

కాగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన 4జీ సేవలను ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. 4జీ సేవల ప్రారంభం సందర్భంగా ఫ్రీ కాల్స్, డేటా సేవలను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కుందిన 1.5 మిలియన యూజర్ల కనెక్ష్లను నిలిపివేయమని కోరుతో టెలికాం శాఖ (డాట్) కు సీవోఏఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై అటు రిలయన్స్, ఇటు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ మధ్య వివాదం కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+