ప్యాసెంజర్ కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ది
జులై నెలలో కొత్త కార్లు దేశవ్యాప్తంగా దూసుకెళ్లాయి. గతేడాది జులై నెలతో పోలిస్తే 17 శాతం మెరుగుదలతో కార్ల అమ్మకాలు వృద్దిని కనబరిచాయి. సొసైటీ ఆప్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో కార్లు, వ్యాన్లు, యుటిలిటీ వాహనాలు తదితరాల అమ్మకాలు 2,59,685గా ఉన్నాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 2,22,368గా ఉంది. రుతుపవనాలు సక్రమంగా వర్షాలను కురిపించడం, ఏడో వేతన కమీషన్ సిఫార్సుల అమలు, యుటిలిటీ వాహనాల అమ్మకాల్లో చెప్పుకోదగ్గ పురోగతి కారణంగా వాహనాలు ఎక్కువగా వినియోగదారుల ఇళ్లకు చేరాయి.

యుటిలిటీ వాహనాల అమ్మకాల్లో 42 శాతం వృద్ది ఉంటూ 45,191 యూనిట్ల నుంచి 64,105 యూనిట్లకు దూసుకెళ్లాయి. కార్ల విక్రయాలు 1,62,022 నుంచి 1,77,604 సంఖ్యకు చేరాయి. రెండు మాసాల తర్వాత కార్ల అమ్మకాల్లో వృద్ది నమోదయింది.
ద్విచక్ర వాహానాల అమ్మకాలు 13.52 శాతం పెరిగి 14,76,340 కు చేరాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 10.98 శాతం మెరుగుదలతో, స్కూటర్లు 16.66 శాతం మెరుగుదలతో ఆటోమొబైల్ రంగానికి ఊపునిచ్చాయి.


Click it and Unblock the Notifications